Mahesh Babu Son సూపర్ స్టార్ మహేష్‌ బాబు కొడుకు గౌతమ్ సోషల్ మీడియాలో కాస్త సైలెంట్‌గానే ఉంటాడు. గౌతమ్ తన కంటూ సోషల్ మీడియా ఖాతాను వాడడు. అంత యాక్టివ్‌గా ఉండడు. సితార అయితే సోషల్ మీడియాలో దుమ్ములేపేస్తుంటుంది. కానీ గౌతమ్ మాత్రం సైలెంట్‌గా ఉంటాడు. అప్పుడప్పుడు నమ్రత షేర్ చేసే విషయాలతోనే గౌతమ్ గురించి జనాలకు తెలుస్తుంటుంది. తాజాగా నమ్రత ఓ విషయాన్ని షేర్ చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


 



స్కూల్‌లో ఫస్ట్ కల్చరర్ ట్రిప్ అంటూ విదేశాలకు వెళ్తున్నాడు.. సొంతంగా వెళ్తున్నాడు.. నాలో సగ భాగం వెళ్తున్నట్టుగా అనిపిస్తోంది.. ఇక నాకు ఒంటరిని అయిపోయాను అనే ఫీలింగ్ వస్తోంది.. మెల్లిమెల్లిగా నేను దీన్ని అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది.. మళ్లీ తిరిగి ఇంటికి వచ్చే వరకు నాకు ఎంతో బాధగా అనిపిస్తుంటుంది.. మళ్లీ నా కళ్ల ముందు వాలే వరకు ఇలానే అనిపిస్తుంది.. నా చిన్ని బిడ్డ తన సొంత రెక్కలతో బయటకు ఎగిరిపోయాడు..


ఈ వారం అంతా కూడా ఎంతో సంతోషంగా ఉండాలి..అడ్వెంచర్లు చేయాలని, హ్యాపీగా, సరదాగా ఉండాలని, నీలో నువ్వు అన్వేషించుకుని కొత్తగా ఆవిష్కరించుకోవాలని కోరుకుంటున్నాను అంటూ తన బిడ్డను సాగనిపింది నమ్రత. మళ్లీ తిరిగి వచ్చే వరకు నేను ఎదురుచూస్తూనే ఉంటాను అంటూ ఎమోషనల్ అయింది.


మామూలుగా అయితే ఇలా ట్రిప్స్‌కు వెళ్లడం మహేష్‌ బాబు ఫ్యామిలీకి కొత్త కాదు. కానీ గౌతమ్ ఒంటరిగా వెళ్తుండటంతో నమ్రత ఇలా ఫీలైపోతోంది. మొదటి సారిగా ఇలా కొడుకు దూరంగా వెళ్తుండటం, తాము లేకుండా వెకేషన్‌కు వెళ్తుండటంతో నమ్రత బెంగపెట్టేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది.


Also Read:  Rakesh Sujatha Marriage : పెళ్లి చేసుకోబోతోన్న సుజాత రాకేష్.. ఎంగేజ్మెంట్ ఎప్పుడో చెప్పేసిన జోర్దార్ జంట


Also Read: Anchor Vishnupriya : బాలయ్య మీద విష్ణు ప్రియ కౌంటర్ వేసిందా?.. దండం పెట్టేసిన యాంకర్ 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook