Namrata Shirodkar about sitara Birth నమ్రత తాజాగా తన పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో విషయాలను చెప్పింది. తాజాగా ఓ జర్నలిస్ట్‌తో స్పెషల్ చిట్ చాట్ చేసింది. ఈక్రమంలో నమ్రత తన పర్సనల్ లైఫ్‌ గురించి చెప్పుకొచ్చింది. పెళ్లి దగ్గరి నుంచి నేటి వరకు జరిగిన విషయాల మీద స్పందించింది. మహేష్ బాబు నటించిన సినిమాల్లో పోకిరి అంటే బాగా ఇష్టమని, నచ్చని సినిమా అయితే వంశీ అని చెప్పింది. ఇక మహేష్‌ బాబు చెప్పిన డైలాగ్స్‌తో బుల్లెట్ దిగిందా? లేదా? అన్న డైలాగ్ బాగా ఇష్టమని తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక తనకు వంట రాదని, వంట మనిషి ఉంటుందని చెప్పుకొచ్చింది నమ్రత. ఆమ్లెట్, టీ, కాఫీ, మ్యాగీ వంటివి మాత్రమే తాను చేయగలను అని అంతకు మించి వంటరాదని తెలిపింది. మహేష్ బాబు అయితే పెళ్లి విషయంలో ఫుల్ క్లారిటీ ఉండేవాడని, పెళ్లి తరువాత నటించకూడదని ముందు చెప్పేసినట్టుగా నమ్రత తెలిపింది. మహేష్‌తో పెళ్లి జరగడమే తనకు హ్యాపీ మూమెంట్ అని నమ్రత చెప్పుకొచ్చింది. తల్లి, భార్యగా తన ధర్మాన్ని నిర్వర్తించేందుకే సినిమాలకు దూరంగా ఉన్నట్టు చెప్పుకొచ్చింది.


 



సితార అన్ వాటెండ్ బేబీ అని, ఒక వేళ సితార పుట్టి ఉండకపోతే మా జీవితాలు అసంపూర్ణంగానే ఉండేవేమో అన్నట్టుగా నమ్రత తెలిపింది. గౌతమ్ పుట్టిన సమయంలో అయితే ఎన్నో కష్టాలు పడ్డాను.. అసలు గౌతమ్ బతుకుతాడో లేదో అన్నట్టుగా వైద్యులు చెప్పారంటూ నాటి చేదు సంఘటనలు చెబుతూ బాధపడింది నమ్రత. ప్రతీ కుటుంబంలో కొన్ని కథలు, బాధలుంటాయి.. మాకు అదే ఇది అంటూ గౌతమ్ బర్త్ గురించి నమ్రత చెప్పింది.


ఇక జీఎంబీ విషయంలోనూ నమ్రత కొన్ని కామెంట్లు చేసింది. తామేదో సినిమాలు తీసేయాలని అనుకోవడం లేదని, తమకు నచ్చిన కథలు వస్తేనే సినిమాలు నిర్మిస్తామని నమ్రత ఖరాఖండిగా చెప్పేనసింది. మేజర్ సినిమా కథ నచ్చిందని, అందుకే ప్యాన్ ఇండియా లెవెల్లో తీయాలని సోనీతో కొలాబరేట్ అయ్యామని నమ్రత పేర్కొంది.


Also Read : Avatar 2 Day 1 Collections : ఇండియాలో అవతార్ 2కు ఎదురుదెబ్బ.. రికార్డుల కొల్లగొట్టని జేమ్స్ కామెరాన్


Also Read : Liger Financier: లైగర్ ను వదలని ఈడీ.. ఈసారి 'శోభన్' విచారణ!


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook