Gautam Ghattamaneni Birth Issue : రోజుకు గ్రా. 10 పెరగాల్సిందేనట.. గౌతమ్ పుట్టిన సమయంలో వచ్చిన సమస్య ఇదే.. నమ్రత ఎమోషనల్
Gautam Ghattamaneni Birth మహేష్ బాబు తనయుడు గౌతమ్‌కు పుట్టినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో అందరికీ తెలిసిందే. డాక్టర్లు కూడా చేతులెత్తేశారట. ఎంతో కష్టపడి గౌతమ్‌ను బతికించారట. ఇప్పుడు ఆ విషయాలన్నీ నమ్రత చెప్పింది.
Namrata on Gautam Ghattamaneni మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని పుట్టిన సమయంలో వచ్చిన సమస్య గురించి అందరికీ తెలిసిందే. నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ ఫస్ట్ సీజన్‌కు మహేష్ బాబు గెస్టుగా వచ్చాడు. ఆ సమయంలో గౌతమ్ పుట్టినప్పుడు వచ్చిన సమస్య గురించి చెప్పాడు. గౌతమ్ పుట్టినప్పుడు తన అరచేయి అంతే ఉన్నాడని, ఆ బాధలు చూశాకే.. ఇంకా ఎవ్వరికీ అలాంటి కష్టాలు రావొద్దని ఫౌండేషన్ పెట్టినట్టు మహేష్ బాబు చెప్పుకొచ్చాడు. డబ్బున్న మాకే ఇలా ఉంటే.. డబ్బు లేనోళ్ల పరిస్థితి ఎలా ఉంటుందనే ఉద్దేశంతోనే సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టుగా మహేష్ తెలిపాడు.
ఇప్పుడు అదే విషయాన్ని నమ్రత మరోసారి చెప్పుకొచ్చింది. ఏడో నెలలో తాను ఓ సారి చెకప్‌కి వెళ్లానని, ఆ సమయంలో బిడ్డ గుండె చప్పుడు వినిపించడం లేదని వైద్యులు గుర్తించారు. వెన్నుముక, మెడ భాగాలు కలిసిపోయినట్టుగా ఉన్నాయని, దీంతో గుండె సరిగ్గా కొట్టుకోవడం లేదంటూ వైద్యులు చెప్పారట. అయితే చాన్స్ తక్కువ అని చెప్పడం,మహేష్ బాబు కూడా హైద్రాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలోనే షూటింగ్ చేస్తుండటంతో వెంటనే వచ్చేశాడట.
రెండు గంటల్లోనే ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారట. ఇక మహేష్ బాబుకు ముందే వైద్యులు ధైర్యం చెప్పారట. బతుకుతాడని కచ్చితంగా చెప్పలేం, కానీ ప్రయత్నం చేస్తామని కౌన్సిలింగ్ ఇచ్చారట. అదంతా కూడా తనకు తెలియదని, అప్పుడు కాన్షియస్‌నెస్‌లో లేనని నమ్రత తెలిపింది. అయితే డాక్టర్లు చాలా కష్టపడి బిడ్డను బతికించారట. మూడు వారాల పాట ఇంక్యుబేషన్‌లో పెట్టారట.
ఆ తరువాత సైతం రోజుకు నలభై గ్రాముల పాలు మాత్రమే పట్టాలని, రోజుకు పది గ్రాముల బరువు పెరగాల్సిందే అని వైద్యులు చెప్పారట. దీంతో ప్రతీ రోజు రాత్రి పడుకునే సమయంలో మొక్కుకునేదట. పొద్దున లేచే సరికి బిడ్డ పది గ్రాముల బరువు పెరిగి ఉండాలని రోజూ దేవుడ్ని ప్రార్థించేదట. అలా ఇప్పుడు తన కొడుకు బీస్ట్‌లా మారిపోయాడంటూ నమ్రత చెప్పుకొచ్చింది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook