Mega Family Christmas 2022 : మెగా అల్లు వారి బంధమిదే.. క్రిస్మస్ సెలెబ్రేషన్ పిక్.. బన్నీ చెర్రీ పోజులు అదుర్స్

Ram Charan And Allu Arjun in Christmas 2022 ఒక్కోసారి రామ్ చరణ్‌, అల్లు అర్జున్ మిస్ అవుతుంటారు. షూటింగ్‌ల కోసం విదేశాలకు వెళ్లినప్పుడే అలా జరుగుతుంది. కానీ ప్రతీ పండుగకు అంతా కలిసేందుకు ప్రయత్నిస్తుంటారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 21, 2022, 09:35 AM IST
  • మెగా క్రిస్మస్ సెలెబ్రేషన్స్
  • ఒక్క చోటే మెగా అల్లు పరివారం
  • బన్నీ, చెర్రీలతో పాటుగా రైమ్
Mega Family Christmas 2022 : మెగా అల్లు వారి బంధమిదే.. క్రిస్మస్ సెలెబ్రేషన్ పిక్.. బన్నీ చెర్రీ పోజులు అదుర్స్

Mega Family Christmas 2022 సోషల్ మీడియాలో మెగా అల్లు ఫ్యామిలీల మధ్య కోల్డ్ వార్ జరుగుతోందనే రూమర్లు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. ఇక అల్లు అర్జున్ తన సొంత బ్రాండ్ కోసం పాటు పడుతున్నాడని, మెగా నీడ నుంచి బయటకు రావాలని చూస్తున్నాడంటూ ఇలా రకరకాల రూమర్లు వస్తుంటాయి. బన్నీ సైతం మెగా హీరోలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నాడని, అందుకే స్టేజీ మీద మాట్లాడే సమయంలో మెగా జపం కాకుండా అల్లు జపం చేస్తున్నాడంటూ టాక్ వినిపిస్తోంది.

ఇలా బయటకు అల్లు, మెగా ఫ్యామిలీ గురించి ఎలాంటి టాక్స్ వచ్చినా కూడా లోలోపల మాత్రం వారంతా చక్కగా కలిసి మెలిసి ఉంటారని అందరికీ తెలిసిందే. దీపావళి, సంక్రాంతి, క్రిస్మస్ ఇలా అన్ని పండుగలను కలిసి సెలెబ్రేట్ చేసుకుంటున్నారన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సారి క్రిస్మస్ సెలెబ్రేషన్ పిక్ బయటకు వచ్చింది. ఇందులో మెగా అల్లు పరివారమంతా కూడా కనిపిస్తోంది.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)

వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్‌, అల్లు బాబీ, సుష్మిత, సుష్మిత భర్త, శ్రీజ, స్నేహా రెడ్డి, అల్లు అర్జున్, రామ్ చరణ్‌ ఇలా అందరూ కూడా కనిపించారు. అయితే నిహారిక మాత్రం సింగిల్‌గానే కనిపించింది. ఆమె భర్త చైతన్య ఈ వేడుకల్లో పాల్గొనట్టు కనిపించడం లేదు. ఇక ఉపాసన అయితే వెనకాల అలా నిల్చుని చిరునవ్వులు చిందిస్తోంది. అసలే ఉపాసన తల్లి కాబోతోందనే వార్తతో ఈ పండుగల్లో సంతోషాలు రెట్టింపు అయినట్టున్నాయి.

ఈ క్రిస్మస్ ఫోటోల్లో అందరి కంటే ఎక్కువగా రామ్ చరణ్‌ పెట్ రైమ్ హైలెట్ అవుతోంది. రామ్ చరణ్ చేతుల్లోనే రైమ్‌ను పట్టుకుని పోజ్ ఇచ్చాడు. రైమ్ నేషనల్ వైడ్‌గా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. కియారా అద్వాణీ సైతం రైమ్ గురించి ఓ షోలో చెప్పిన సంగతి తెలిసిందే.

Also Read : Bigg Boss Samrat Love Stories : సామ్రాట్ లిఖితల గుట్టు లాగే ప్రయత్నం.. పెళ్లికి ముందు లవ్ స్టోరీలపై సుమ ప్రశ్నలు

Also Read : Kushi Re Release : పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్ స్పెషల్.. సర్ ప్రైజ్‌ ఇచ్చిన డైరెక్టర్ ఎస్ జే సూర్య

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x