గీత గోవిందం దర్శకుడు పరుశురామ్ దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్‌ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నటిస్తున్న తాజా సినిమా ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata). కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ కొన్ని నెలలు వాయిదా పడటం తెలిసిందే. అయితే ఇదివరకే విడుదలైన సర్కారు వారి పాట ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌లకు విశేషమైన స్పందన లభించింది. ఇటీవల ఓ యాడ్ కోసం షూటింగ్ సెట్‌లో మహేష్ బాబు సందడి చేశారు. తాజాగా తన లేటెస్ట్ ప్రాజెక్టు ‘సర్కారు వారి పాట’ను మహేష్ బాబు మొదలుపెట్టినట్లు కనిపిస్తున్నారు.



 


తన భర్త మ‌హేష్ బాబు సెట్‌లో ఉన్న సమయంలో తీసిన ఓ ఫొటోను నమ్రతా శిరోద్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘లైట్స్‌.. కెమెరా.. యాక్షన్’ ఈ మూడు ప‌దాలు సినిమా స్టార్స్‌కి మ్యాజిక్ క్రియేట్ చేస్తాయ‌ని రాసుకొచ్చారు నమ్రత. మాలాంటి వారికి సెట్‌లోనే జీవితం అంటూ పెద్ద అర్థం వచ్చేలా పోస్ట్ చేశారు. ప్రిన్స్ మహేష్ సర్కారు వారి పాట మొదలైంది అంటూ సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ సంతోషంలో మునిగితేలుతున్నారు.



 



 


టాలీవుడ్ ‘ప్రిన్స్’ మహేష్ బాబుకు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. బాలీవుడ్ నుంచి విద్యాబాలన్, దక్షిణాది నటుడు అరవింద స్వామి కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లపై రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata)ను నిర్మిస్తున్నారని తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe