Akhanda Making Video: నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన చిత్రం 'అఖండ'. గతేడాది డిసెంబరు 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ చిత్రం టాలీవుడ్ లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఇప్ప‌టికే 50 రోజులు పూర్తి చేసుకున్న అఖండ సినిమాను తాజాగా డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ ఓటీటీలో కూడా రిలీజ్ చేశారు. తెలుగు ఆడియోతో.. ఇంగ్లీష్ స‌బ్‌టైటిల్స్‌తో సినిమాను హాట్‌స్టార్‌లో వీక్షించ‌వ‌చ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

థియేట‌ర్ల‌లో సినిమా ఎన్ని రికార్డుల‌ను క్రియేట్ చేసిందో.. హాట్‌స్టార్‌లో కూడా అదే రేంజ్‌లో రికార్డులు బ‌ద్ద‌లు కొడుతోంది. ఇప్ప‌టికే అఖండ సినిమాకు భారీ స్థాయిలో వ్యూస్ వ‌చ్చాయి. దీంతో ఈ సినిమా మేకింగ్ వీడియోను హాట్‌స్టార్ త‌న యూట్యూబ్ అకౌంట్‌లో షేర్ చేసింది. 


సినిమా మేకింగ్ వీడియోను సినిమా పూర్త‌య్యాక కూడా చూడొచ్చు. దాన్ని స‌ప‌రేట్ చేసి ఆ వీడియోను హాట్‌స్టార్ యూట్యూబ్‌లో షేర్ చేయ‌డం వల్ల ఆ వీడియో యూట్యూబ్‌లో రికార్డుల‌ను తిర‌గ‌రాస్తోంది. హాట్‌స్టార్‌లో రిలీజ్ అయిన 5 గంట‌ల్లోనే ల‌క్ష‌ల్లో మేకింగ్ వీడియోకు వ్యూస్ వ‌చ్చాయి. ఇంకెందుకు ఆల‌స్యం.. బాల‌య్య బాబు అఖండ సినిమా మేకింగ్ వీడియో ఎలా ఉందో మీరే చూడండి. 



Also Read: Samantha Item Song: మరో పాన్ఇండియా మూవీలో ఐటెం సాంగ్ కు 'ఊ' కొట్టిన సమంత!


Also Read: Dhanush-Aishwaryaa: హైదరాబాద్‌లో ఒకే హోటల్లో ధనుష్, ఐశ్వర్య, విడాకుల తర్వాత ఇలా..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook