Samantha Item Song: మరో పాన్ఇండియా మూవీలో ఐటెం సాంగ్ కు 'ఊ' కొట్టిన సమంత!

Samantha Item Song: అక్కినేని నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సినిమాల్లో సమంత దూకుడు పెంచేసింది. వరుస చిత్రాల్లో నటించేందుకు అంగీకరించడం సహా పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ వంటి వాటికీ ఈ అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. ఇప్పుడు టాలీవుడ్ కు చెందిన మరో పాన్ ఇండియా చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసేందుకు సామ్ ఒప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంతకీ అదేం సినిమానో తెలుసా?  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 23, 2022, 03:49 PM IST
    • మరో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయనున్న హీరోయిన్ సమంత
    • లైగర్ సినిమాలోని స్పెషల్ సాంగ్ లో నటించనుందని సమచారం
    • విజయ్ దేవరకొండతో ఉన్న పరిచయం కారణంగానే గ్రీన్ సిగ్నల్!
Samantha Item Song: మరో పాన్ఇండియా మూవీలో ఐటెం సాంగ్ కు 'ఊ' కొట్టిన సమంత!

Samantha Item Song: హీరో నాగచైతన్యతో విడిపోయిన తర్వాత వరుస ప్రాజెక్టుల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది స్టార్ హీరోయిన్ సమంత. వీటితో పాటు ఐటెం సాంగ్స్ లోనూ నటించేందుకు సామ్ ఇప్పుడు సై అంటోంది. ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన 'పుష్ప' సినిమా కోసం 'ఊ అంటావా మావ' అంటూ బన్నీతో కలిసి స్టెప్పులేసింది. సమంత వేసిన స్టెప్పులతో ఈ పాటకు మరింత క్రేజ్‌ వచ్చింది. సుమారు రెండు వారాల క్రితం విడుదల చేసిన ఈ పాట ఫుల్‌ వీడియో 73 మిలియన్ల వ్యూస్‌ సొంతం చేసుకుంది.

ఇప్పుడు.. స్టార్ హీరోయిన్ సమంతకు మరో క్రేజీ ఆఫర్ వచ్చినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్లో రూపొందుతోన్న 'లైగర్' సినిమాలో ఐటెం సాంగ్ కు సామ్ ను ఎంచుకున్నారని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. విజయ్ దేవరకొండతో ఉన్న పరిచయం కారణంగా ఆమె ఈ స్పెషల్ సాంగ్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.  

కిక్‌ బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉందట. ఆ పాట కోసం ఎవరైనా స్టార్‌ హీరోయిన్‌ను ఎంచుకోవాలని పూరీ జగన్నాథ్‌, ఆయన టీమ్‌ భావించిందట. ఇదే సమయంలో 'ఊ అంటావా' పాట సూపర్‌హిట్‌ కావడం వల్ల తమ సినిమాలోనూ ఐటమ్‌ సాంగ్‌ను సామ్ ను ఎంచుకుంటే బాగుంటుందని నిర్ణయించుకున్నట్లు సమాచారం. 

ఇప్పటికే చిత్రబృందం సామ్‌తో సంప్రదింపులు జరపడం సహా విజయ్‌ దేవరకొండ కూడా తనకున్న చనువుతో ఆమెను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని టాక్‌ వినిపిస్తోంది. మరి విజయ్‌ దేవరకొండ, పూరీ జగన్నాథ్ రిక్వెస్ట్ కు సమంతం ఓకే చెప్పిందా? లేదా? తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడక తప్పదు. మరోవైపు, 'మహానటి' సినిమాలో సమంత- విజయ్‌ దేవరకొండ కలిసి పనిచేశారు.  

Also Read: Dhanush-Aishwaryaa: హైదరాబాద్‌లో ఒకే హోటల్లో ధనుష్, ఐశ్వర్య, విడాకుల తర్వాత ఇలా..

Also Read: Nidhhi Agerwal Photoshoot: నిధి అగర్వాల్ ఫోటో షూట్.. చూపు తిప్పుకోనివ్వని అందం! పావురాల మందలో రాజహంస!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News