Akhanda Trailer Released: నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనుల(boyapati srinu) కాంబోలో వస్తున్న మూడో చిత్రం 'అఖండ'.  సింహా’, ‘లెజెండ్‌’.. తర్వాత వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో బాలకృష్ణ(Nandamuri Balakrishna) ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) హీరోయిన్ గా నటిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారని, పైగా అఘోరాగా కనిపించనున్నట్లు తెలిసినప్పటి నుంచీ ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టైటిల్‌ గీతం ఆకట్టుకున్నాయి. 'అఖండ రోర్‌'(Akhanda Roar)’ పేరుతో ఆదివారం ట్రైలర్‌(Akhanda Trailer)ను విడుదల చేసింది చిత్రబృందం. 


Also Read: NBK 107 Movie: మాస్ కాంబినేషన్ షురూ.. బాలకృష్ణ, గోపీచంద్ మలినేని సినిమా స్టార్ట్


ట్రైలర్ ఓపెన్  చేస్తే..‘'విధికి విధాతకు విశ్వానికి సవాళ్లు విసరకూడదు'’..డైలాగ్‌తో మొదలవుతోంది. ట్రైలర్‌ను దర్శకుడు డైలాగులతో నింపేశారు. ‘'అంచనా వేయడానికి పోలవరం డ్యామా.. పట్టిసీమ తూమా.. పిల్ల కాలువ'’ అంటూ పవర్ డైలాగ్‌తో బాలయ్య కేక పుట్టించాడు. బాలకృష్ణ(Balakrishna) అభిమానులు కోరుకునే అన్ని హంగులూ ఈ చిత్రంలో ఉన్నట్టు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతుంది. ఈ చిత్రంలో జగపతిబాబు, శ్రీకాంత్‌(Srikanth) కీలక పాత్రలు పోషిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook