NBK 107 Movie: మాస్ కాంబినేషన్ షురూ.. బాలకృష్ణ, గోపీచంద్ మలినేని సినిమా స్టార్ట్

NBK 107 Movie: నందమూరి బాలకృష్ణ-దర్శకుడు గోపిచంద్ మలినేని (Balakrishna Gopichand Malineni) కాంబో సినిమా షూటింగ్ ప్రారంభమైంది. పూజాకార్యక్రమాలతో లాంఛనంగా చిత్రీకరణను ప్రారంభించారు (NBK 107 updates). ఈ చిత్రంలో బాలయ్య సరసన శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించనుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 13, 2021, 12:12 PM IST
NBK 107 Movie: మాస్ కాంబినేషన్ షురూ.. బాలకృష్ణ, గోపీచంద్ మలినేని సినిమా స్టార్ట్

NBK 107 Movie: నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా ప్రారంభమైంది. ఆయన కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సరికొత్త చిత్రం (Balakrishna Gopichand Malineni) తెరకెక్కనున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ సినిమా పూజా కార్యక్రమం శనివారం ఉదయం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్రబృందంతోపాటు పలువురు టాలీవుడ్‌ దర్శకులు హాజరై అభినందనలు తెలిపారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ, బోయపాటి శ్రీను, హరీశ్‌ శంకర్‌, వి.వి.వినాయక్‌, బుచ్చిబాబు, బాబీతోపాటు మాటల రచయిత సాయిమాధవ్‌ బుర్రా ఈ వేడుకలో పాల్గొన్నారు. 

బాలయ్య 107వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుంది. పక్కా మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా సిద్ధం కానున్నట్లు సమాచారం. ఇందులో బాలయ్య ఫుల్‌ యంగ్‌ లుక్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.  బాలకృష్ణకు జోడీగా నటి శ్రుతిహాసన్‌ సందడి చేయనున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై ఈ చిత్రం నిర్మితమవుతోంది. మరోవైపు ఇటీవల విడుదలైన ‘క్రాక్‌’ చిత్రంతో గోపీచంద్‌ మలినేని సూపర్‌హిట్‌ని సొంతం చేసుకున్నారు. ఇక, బాలయ్య ప్రస్తుతం ‘అఖండ’ చిత్రంలో నటిస్తున్నారు. 

Also Read: Radheshyam First Single: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘రాధేశ్యామ్’ తొలి సాంగ్ రిలీజు డేట్ ఫిక్స్

Also Read: Mahasamudram OTT Release: నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతున్న శర్వానంద్, సిద్ధార్థ్ ‘మహాసముద్రం’ మూవీ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News