Nandamuri Balakrishna as Chief guest to Urvasivo Rakshasivo Pre Release Event: అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ గౌరవం అనే సినిమాతో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సినిమా బాగానే ఉన్నా అల్లు శిరీష్ కి మాత్రం పెద్దగా క్రేజ్ దక్కలేదు. ఆ తర్వాత కూడా కొత్తజంట, ఏబిసిడి, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం వంటి సినిమాలతో ప్రేక్షకులను అలకరించే ప్రయత్నం చేశారు. కానీ తన సోదరుడు అల్లు అర్జున్ కి దక్కిన క్రేజ్ మాత్రం అల్లు శిరీష్ కి తగ్గలేదు. అయినా సరే అల్లు అరవింద్ మాత్రం తన కుమారుడిని ఎలా అయినా హీరోగా నిలబెట్టాలనే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక అల్లు శిరీష్ అను ఇమ్మానియేల్ తో కలిసి ఊర్వశివో రాక్షసివో అనే సినిమా చేశారు. రాకేష్ శశి ఈ సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో మొన్నటి వరకు క్లారిటీ లేదు. కానీ కొన్ని రోజుల క్రితం ఈ సినిమాని నవంబర్ 4వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఇంటర్వ్యూలలో పాల్గొంటూ తన సినిమాని ప్రమోట్ చేసుకునే పనిలో పడ్డారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్టోబర్ 30వ తేదీన హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించేందుకు అల్లు అరవింద్ ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు.


ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నందమూరి బాలకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. నందమూరి బాలకృష్ణ ఆహా వీడియోలో అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె అనే ప్రోగ్రాంకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన మొదటి సీజన్ విజయవంతంగా పూర్తయింది, రెండో సీజన్లో షూటింగ్ కూడా మొదలైంది. ఇప్పటికే రెండు ఎపిసోడ్లు రిలీజ్ అయ్యాయి ప్రతి శుక్రవారం ఒక ఎపిసోడ్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటుంది ఆహా వీడియో యాజమాన్యం.


ఈ నేపథ్యంలోనే అల్లు అరవింద్ బాలకృష్ణ మధ్య మంచి సాన్నిహిత్య సంబంధాలు ఏర్పడ్డాయి. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ అల్లు రామలింగయ్య మధ్య ఎలాంటి సన్నిహిత సంబంధాలు ఉన్నాయో ఇప్పుడు తమ మధ్య కూడా అంత మంచి స్నేహం ఉందని ఆ మధ్య బాలకృష్ణ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తన స్నేహితుడి కుమారుడి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అడగగానే బాలకృష్ణ వచ్చేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఈ ఈవెంట్ కి కేవలం నందమూరి బాలకృష్ణ ఒక్కరే హాజరవుతారా? అల్లు శిరీష్ సోదరుడు అల్లు అర్జున్ కూడా హాజరవుతారా అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తుంది.
Also Read: Godfather Vs Lucifer: లూసిఫర్ దరిదాపుల్లోకి రాలేకపోయిన గాడ్ ఫాదర్.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతంటే?


Also Read: RRR Japan Day 1 Collections: దారుణంగా జపాన్ ''ఆర్ఆర్ఆర్'' ఓపెనింగ్ కలెక్షన్స్.. మొదటి రోజు ఎంత వసూలైందంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook