Godfather Vs Lucifer: లూసిఫర్ దరిదాపుల్లోకి లేని గాడ్ ఫాదర్.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతంటే?

Chiranjeevi’s Godfather Collections vs Mohan Lal’s Lucifer Collections: మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా వసూళ్లు గురించి మరోమారు చర్చ మొదలైంది, మలయాళ ఒరిజినల్  లూసిఫర్ సినిమాతో పోలుస్తూ ఈ సినిమా గురించి కామెంట్లు చేస్తున్నారు. ఆ వివరాలు 

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 22, 2022, 08:33 PM IST
  • లూసిఫర్ తెలుగు రీమేక్ గా గాడ్ ఫాదర్
  • లూసిఫర్ దరిదాపుల్లోకి రాలేకపోయిన గాడ్ ఫాదర్..
  • ఫైనల్ కలెక్షన్స్ ఎంతంటే?
Godfather Vs Lucifer: లూసిఫర్ దరిదాపుల్లోకి లేని గాడ్ ఫాదర్.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతంటే?

Chiranjeevi’s Godfather Collections vs Mohan Lal’s Lucifer Collections: మెగాస్టార్ చిరంజీవి హీరోగా గాడ్ ఫాదర్ అనే సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. దసరా సందర్భంగా ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీన తెలుగు సహా హిందీ భాషల్లో విడుదలైంది. ఒక పది రోజుల వ్యవధిలో సినిమాని తమిళ వర్షన్ లో కూడా విడుదల చేశారు. నిజానికి ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ అనే సినిమాకి తెలుగు రీమేక్ గా రూపొందించారు.

మోహన్ రాజా డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా నటించడంతో హిందీ మార్కెట్ వర్కౌట్ అవుతుందనే ఉద్దేశంతో దాన్ని హిందీ డబ్బింగ్ చేయించి రిలీజ్ చేశారు. ఈ సినిమాకి మంచి టాక్ రావడంతో సినిమా విడుదలైన పది రోజుల తర్వాత తమిళంలో కూడా విడుదల చేశారు. అయితే ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో మాత్రం ముందు నుంచి కాస్త వ్యత్యాసం అయితే కనిపిస్తుంది. సినీ ట్రేడ్ వర్గాల వారి నుంచి బయటకు వస్తున్న సమాచారానికి సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటిస్తున్న సమాచారానికి చాలా తేడా ఉంటుంది.

ఇదే విషయం గురించి సినిమా నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఒక ప్రెస్ మీట్ లో ప్రశ్నిస్తే అసలు లూసిఫర్ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉండగా మేము రీమేక్ చేయడమే చాలా డేరింగ్ డెసిషన్ అలాంటి సినిమాకి ఇంత వస్తున్నాయి అంత వస్తున్నాయి అని చెప్పుకోవడానికి మాకు ఇష్టం లేదు ఇది అసలు చర్చించాల్సిన అవసరమే లేదన్నట్టు పక్కన పెట్టేశారు. అయితే ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచే ప్రతి విషయంలోనూ పోలికలు మొదలయ్యాయి.

మలయాళంలో మోహన్ లాల్ నటన అలా ఉంది ఇక్కడ చిరంజీవి నటన ఇలా ఉంది అంటూ మొదలుపెట్టి ప్రతి ఫ్రేమ్ ను కంపేర్ చేస్తూ పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ దక్కింది కానీ కలెక్షన్స్ మాత్రం పెద్దగా ప్రభావితం చేయలేకపోయాయి. లూసిఫర్ సినిమా కేవలం మలయాళంలో మాత్రమే థియేటర్లలో విడుదలైంది. అయితే ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 160 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.

కానీ లూసిఫర్ సినిమా తెలుగు తమిళ హిందీ వర్షన్స్ అన్నీ కలిపినా 100 కోట్లు మాత్రమే దాటాయి అంటే దాదాపు 60 కోట్ల రూపాయల వ్యత్యాసం ఇక్కడ కనిపిస్తుంది. నిజానికి గాడ్ ఫాదర్ సినిమా విడుదలైనప్పటి నుంచి మలయాళంలో ఉన్న మోహన్ లాల్ ఫ్యాన్స్ గాడ్ ఫాదర్ ని దారుణంగా టోల్ చేస్తూ వచ్చారు. దానికి కారణం మెగాస్టార్ చిరంజీవి ఒక ప్రమోషనల్ ఈవెంట్ లో మాట్లాడుతూ లూసిఫర్ సినిమాలో తనకు కొన్ని పాయింట్స్ నచ్చలేదని ఆ పాయింట్స్ ని సరి చేస్తూ ఈ సినిమాను రూపొందించామని చెప్పుకొచ్చారు.

ఆయన అన్నట్లుగానే ఆ పాయింట్స్ సరి చేస్తూ చేసిన సినిమా తెలుగు ప్రేక్షకులకు నచ్చింది కానీ థియేటర్లకు వెళ్లి ఆదరించడం మాత్రం జరగలేదు. దీంతో ప్రొడ్యూసర్లు దీన్ని లాభం కోసం చేయలేదని చెబుతున్నా సరే లూసిఫర్ కలెక్షన్స్ కు ఈ సినిమా కలెక్షన్స్ కు మధ్య తేడా మాత్రం సుస్పష్టంగా కనిపిస్తోంది.

(గమనిక : ఈ సమాచారం వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా సేకరించినది, వీటిని జీ తెలుగు న్యూస్ ధృవీకరించడం లేదు.)​

Also Read: Deepavali Box Office Report: మొదటి రోజు సత్తా చాటిన ప్రిన్స్.. సర్దార్, ఓరి దేవుడా, జిన్నా పరిస్థితి ఏంటంటే?

Also Read: Pooja Prasad into Movies: సినీ ఎంట్రీ ఇవ్వనున్న రాజమౌళి కోడలు.. ఆ ఫొటోతో మేటర్ లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News