NBK Birth Day: టాలీవుడ్ అగ్ర నటుడు, నాలుగు దశాబ్దాలు దాటుతున్న ఏమాత్రం తగ్గని నటనా సామర్ధ్యంతో బ్లాక్‌బస్టర్ హిట్స్ అందిస్తున్న బాలకృష్ష పుట్టినరోజు జూలై 10. ఈ సందర్భంగా బాలయ్య..కెరీర్ ఓసారి పరిశీలిద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బాలకృష్ణ స్థానం విశిష్టమైంది. ఏకంగా నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో పెద్ద హీరోగా వెలుగొందుతున్నాడు. ఎన్టీఆర్ కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. అనతి కాలంలోనే తనదైన శైలి యాక్టింగ్‌తో సందడి చేశారు. అదే సమయంలో ఫాలోయింగ్‌, మార్కెట్‌ను గణనీయంగా పెంచుకుని సత్తా చాటారు. ఇలా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. గత ఏడాది వచ్చిన అఖండతో ఆయన మరోసారి హిట్ ట్రాక్ ఎక్కడంతో పాటు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ సక్సెస్‌ అందుకున్నారు.


అఖండ తరువాత బాలకృష్ణ మరింత ఉత్సాహంగా మరోమాస్ సినిమాకు తెరలేపారు. ఈసారి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 107 సినిమా చేస్తున్నారు. బాలకృష్ణ పుట్టినరోజు సందర్బంగా జూన్ 9వ తేదీ సాయంత్రం ఎన్‌బికే 107 సినిమా టీజర్ విడుదలై సెన్సేషన్ రేపుతోంది. 


బాలకృష్ణ కెరీర్


బాలకృష్ణకు హీరోగా బ్రేక్ ఇచ్చిన చిత్రం కోడి రామకృష్ణ దర్శకత్వంలో 1984లో తెరకెక్కిన మంగమ్మ గారి మనవడు. ఇక ఆ తరువాత బాలయ్య వెనుదిరిగి చూసుకోలేదు. ఆ తరువాత డి రామానాయుడు నిర్మించిన కధా నాయకుడు బాక్సాఫీసు సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రముఖ హాస్య దర్శకుడు జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన బాబాయ్ అబ్బాయ్ సినిమా మరో సూపర్ హిట్. బాలయ్య కామెడీ కోణాన్ని పరిచయం చేసింది ఈ సినిమానే. ఇక కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ముద్దుల కృష్ణయ్య మరో బ్లాక్ బస్టర్ మూవీ. కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన నారీ నారీ నడుమ మురారి సినిమా బాక్సాఫీసు సూపర్ హిట్ సినిమా. బాలయ్య హీరోగా వచ్చిన తొలి సైన్స్ ఫిక్షన్ సినిమా ఆదిత్య 369 బెస్ట్ పిక్చర్‌గా నిలిచింది. 


రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన బంగారు బుల్లోడు సినిమా సంచలనంగా నిలిచింది. అదే రోజు అంటే 1993లో విడుదలైన మరో చిత్రం నిప్పు రవ్వ సైతం హిట్ మూవీగా నిలిచింది. ఇక జానపద సినిమాలకు బాలయ్య తెరంగేట్రం చేసి..హిట్ సాధించింది భైరవద్వీపం సినిమాతో. ఇక అన్ని సినిమా రికార్డుల్ని తిరగరాసిన సినిమా బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన సమర సింహారెడ్డి. తెలుగు ఫ్యాక్షన్ సినిమాలకు ఈ సినిమా ఓ ట్రెండ్ సెట్టర్. 6 కోట్లతో తెరకెక్కి..అప్పట్లోనే 20 కోట్లు వసూలు చేసింది. మరో ఫ్యాక్షన్ కధా చిత్రం నరసింహనాయుడు. ఇది కూడా బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమానే. 


ఇక 2010లో బోయపాటి శ్రీను తెరకెక్కించిన సింహ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు చేసింది. 2104లో విడుదలైన మరో బోయపాటి శ్రీను-బాలయ్య కాంబినేషన్ సినిమా లెజెండ్. ఈ సినిమా కొన్ని ప్రాంతాల్లో వేయి రోజుకు కూడా ఆడింది. ఇక గత ఏడాది విడుదలై భారీ విజయం సాధించిన సినిమా అఖండ. 60 ఏళ్ల వయస్సులో కూడా బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపుతున్న బాలయ్య..107వ సినిమాలో ఇప్పుడు బిజీగా ఉంటూ..62వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. 1960లో పుట్టిన బాలయ్యకు..ఇప్పుడు 62 ఏళ్లు. హ్యాపీ బర్త్ డే బాలకృష్ణ అలియాస్ బాలయ్య అలియాస్ ఎన్‌బికే.


Also read: NBK107FirstHunt: నరకటం మొదలుపెడితే ఏ పార్ట్ ఎవడిదో మీ పెళ్లాలకు కుడా తెలీదు.. నా కొడకల్లారా!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook