Nandamuri Balakrishna: బాలకృష్ణ వీడియోలు బయటకు.. బాబు బంగారం అంటూ పండుగ చేసుకుంటున్న ఫాన్స్
Nandamuri Balakrishna Lunch with Fans Family: నందమూరి బాలకృష్ణ తన అభిమాని కుటుంబంతో కలిసి భోజనం చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Nandamuri Balakrishna Lunch with Fans Family: నందమూరి బాలకృష్ణకు ఉన్న అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తిట్టినా కొట్టిన మా బాలయ్యే కదా అంటూ ఒకోసారి ఆయన చేత దెబ్బలు కూడా తింటూ ఉంటారు ఆయన అభిమానులు. అయితే ఇప్పుడు వాళ్లంతా కాలర్ ఎగరేసుకునే వార్త ఒకటి బయటకు రావడంతో అదిరా మా బాలయ్య అంటే అంటూ సోషల్ మీడియాలో కాలర్ ఎగరేస్తున్నారు.
ఇంతకీ అసలు విషయం ఏమిటంటే నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం గోపీచంద్ మలినేని ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కర్నూలు జిల్లాలోని కర్నూలు పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. తాజాగా కర్నూలు షూటింగ్ నిమిత్తం వెళ్లిన బాలకృష్ణ గతంలో తాను కలుస్తానని మాట ఇచ్చిన ఒక అభిమానికి ఫోన్ చేసి కుటుంబ సమేతంగా భోజనానికి రావాలని ఆహ్వానించారు. ఇంకేముంది అభిమాన హీరో భోజనానికి పిలిస్తే ఏ అభిమాని వెళ్లకుండా ఉంటాడు. ఆయన కూడా తన కుటుంబాన్ని తీసుకుని భోజనానికి వెళ్ళాడు.
బాలకృష్ణ తన అభిమానిని కుటుంబ సమేతంగా తనతో పాటు కూర్చోబెట్టుకుని భోజనం పెట్టించడమే కాక వారితో కాసేపు సరదా సరదాగా గడిపారు. ఈ సందర్భంగా కొన్ని వీడియోలు తీయగా అవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాక ఆ కుటుంబంలో ఒక బాబు ఉంటే ఆ బాబుతో ఫోటో దిగడానికి కూడా బాలకృష్ణ ప్రయత్నించారు. అయితే అక్కడ ఉన్న జనాన్ని చూసి ఆ బాబు భయపడుతుంటే కాసేపు ఆయనే మరిపిస్తూ మురిపిస్తూ మళ్ళీ నవ్వించేలా చేసి ఫోటోలకు ఫోజులు ఇచ్చిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇంకేముంది మా బాలయ్య బంగారం అంటూ ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఇదిరా బాలయ్య నిజస్వరూపం ఎందుకు ఆయనను అభిమానులను కొట్టే యాంగిల్ మాత్రమే మీడియాలో హైలెట్ చేస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటివి చూసినప్పుడు వార్తలు రాయడానికి మనసు రావా అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.
Read Also: Rashmika Mandanna: హాట్ అలెర్ట్.. బ్లాక్ డ్రెస్ లో కాక రేపుతున్న రష్మిక మందన్నా
Read Also: Sravanthi Chokkarapu: బిగ్ బాస్ స్రవంతి ప్రైవేట్ ఫోటోలు లీక్.. భర్తతో కలిసి బెడ్ పై!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook