Nandamuri Balakrishna Natural star Nani's Unstoppable Episode 2 Bloopers Video goes viral: తాను తొడ కొట్టడానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ను అంటూ హీరో నందమూరి బాలకృష్ణ ( Balakrishna) అన్నారు. బాలయ్య బాబు హోస్ట్‌గా తెలుగు ఓటీటీలో ప్రసారమవుతున్న షో అన్‌స్టాపబుల్‌ (Unstoppable) ఒక్క ఎపిసోడ్‌తోనే అందరినీ ఆకట్టుకుంది. ఫస్ట్ ఎపిసోడ్‌లో మోహన్‌బాబు (Mohanbabu) సందడి చేశారు. ఇక రెండో ఎపిసోడ్‌కు నాని వచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాలయ్యబాబు.. నానితో (Nani) చేసిన చిట్‌చాట్‌ కు సంబంధించిన పలు ఆసక్తికర సన్నివేశాలను వీడియో రూపంలో ఆహా రిలీజ్ చేసింది. సర్‌ చివరిలో తొడ కొట్టాలి అంటూ నాని అడగగా.. తొడ కొట్టడానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ని (Brand Ambassador) అంటూ బాలయ్య సమాధానం ఇస్తారు. తాను ఏ ఫంక్షన్‌కు వెళ్లినా గురువుగారు తొడకొట్టండి అని అంటారని.. ఇప్పుడెందుకు రా ఇవన్నీ అంటే ఒప్పుకోరని బాలకృష్ణ పేర్కొన్నారు.


 


Also Read : IND vs NZ:ముగిసిన తొలిరోజు ఆట..అర్ధ శతకాలతో ఆకట్టుకున్న అయ్యర్,జడేజా! భారత్ స్కోర్??


ఇక మీకు బాలయ్యగారితో నటించే అవకాశం వస్తే ఏ రోల్‌ సెలక్ట్‌ చేసుకుంటారు అంటూ ఆడియన్స్‌ నుంచి ఒకరు అడగ్గా సినిమా కథ రెడీగా ఉందా అని బాలకృష్ణ అతన్ని ప్రశ్నించారు. ఇక ఈ ప్రశ్నకు నాని సమాధానం ఇస్తూ గాడ్‌ ఫాదర్‌లో (Godfather) ఆయన బ్రాండో అయితే.. అల్‌పిచినో రోల్‌ తాను చేస్తా అని నాని అన్నారు. మొత్తానికి బాలయ్యబాబు.. (Balakrishna) నానిల మధ్య జరిగిన సరదా సంభాషలన్నీ ఆకట్టుకుంటున్నాయి.


Also Read : Health tips: గుడ్డుతో పాటు ఈ ఆహారపదార్థాలు కలిపి తింటే.. ఇక అంతేనట!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook