Nandamuri Balakrishna - Unstoppable season 2 : నందమూరి బాలకృష్ణ ఆహా కోసం చేసిన షోతో ఎంత మంచి పేరు వచ్చిందో అందరికీ తెలిసిందే. అన్ స్టాపబుల్ షోతో బాలయ్య అందరికీ దగ్గరయ్యాడు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా బాలయ్య అందరి హీరోలతో ప్రేమగా ముచ్చట్లు పెట్టాడు. తనలోని మరో కోణాన్ని చూపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇక మొదటి సీజన్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో.. రెండో సీజన్‌ను భారీ ఎత్తులో ప్లాన్ చేశారు. దీనిలో భాగంగా మొదటి ఎపిసోడ్‌ కోసం సొంతింటి మనుషులను తీసుకొచ్చాడు బాలయ్య బాబు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తన బావ, టీడీపీ అధినేత చంద్రబాబుతోనే బాలయ్య తన మొదటి ఎపిసోడ్ చేస్తున్నాడు. ఈ మేరకు ఆన్ సెట్ పిక్స్ లీకయ్యాయి. ఇక ఇందులో భాగంగానే ఓ ఫన్నీ సంభాషణ జరిగినట్టు కూడా తెలుస్తోంది. బావ బావమరదులు రొమాంటిక్ టాక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. బాలయ్య తనకు రెండు ఫ్యామిలీలున్నాయని చెప్పడం.. వెంటనే చంద్రబాబు ఫోన్ తీసుకుని బాలయ్య భార్య వసుంధరా దేవికి ఫోన్ చేస్తానని బెదిరించడం వంటివి జరిగిందట.


రెండు ఫ్యామిలీల్లో ఒకటి ఆహా ఫ్యామిలీ అని బాలయ్య కవర్ చేసేశాడట. దీంతో బాబు కూల్ అయిపోయాడట. అంతే కాకుండా తన బావ చేసిన రొమాంటిక్ పనులు గురించి ఆరా తీయాలని బాలయ్య ప్రయత్నించినట్టు తెలుస్తోంది. బావా.. నువ్ చేసిన రొమాంటిక్ పనులు ఏంటి? అని చంద్రబాబుని బాలయ్య అడిగాడు. నీకంటే రొమాంటిక్ కాదు బాలయ్య అని చంద్రబాబు రివర్స్ కౌంటర్ వేశాడట.


మొత్తానికి ఈ ఎపిసోడ్ మాత్రం ఫన్నీగా సాగినట్టు టాక్. మామూలుగా అయితే ఈ మొదటి ఎపిసోడ్‌కు చిరంజీవి గెస్టుగా వస్తాడని అప్పట్లో టాక్ వచ్చింది. గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్స్ కూడా కలిసి వస్తాయని అనుకున్నారట. కానీ చివరకు ఇలా చంద్రబాబుతో బాలయ్య మొదటి ఎపిసోడ్ చేసేశాడు. మరి ఈ రెండో సీజన్లో అయినా బాలయ్య చిరు కలిసి కనిపిస్తారా? లేదా? అన్నది చూడాలి.


Also Read : లిప్ కిస్ దెబ్బకు పీడకలలు.. రాత్రంతా ఏడుస్తూనే ఉండేదాన్ని..బాధ బయటపెట్టిన రష్మిక


Also Read : Ganesh Bellamkonda : తెర వెనుక అలవాటే అంటోన్న బెల్లంకొండ హీరో


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook