Nandamuri Balakrishna to Host Bigg Boss 6 Telugu: బిగ్ ‏బాస్ (Bigg Boss) రియాల్టీ షోకు ఎంత పాపులారీతో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా ఎక్కడైనా బిగ్ ‏బాస్ షోకు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ క్రమంలోనే అభిమానులు మరింత ఆకట్టుకునేందుకు మేకర్స్ ప్రతిసారి ప్రయత్నిస్తున్నారు. తెలుగులో ఇటీవలే ఐదవ సీజన్ ఘనంగా ముగిసింది. రెండు నెలల పాటు అభిమానులను అలరించిన ఇదో సీజన్ విజేతగా సన్నీ నిలిచిన విషయం తెలిసిందే. అయితే వచ్చే సీజన్‌ గురించి హోస్ట్ నాగార్జున (Nagarjuna) ఓ హింట్ ఇచ్చారు. మరో రెండు నెలల్లో బిగ్‌ బాస్‌ (Bigg Boss Telugu) తర్వాతి సీజన్‌ రాబోతుందని ప్రకటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరో రెండు నెలల్లో బిగ్‌ బాస్‌ ఉంటుందని చెప్పిన కింగ్ నాగార్జున (Nagarjuna).. అది ఆరవ సీజనా? లేదా బిగ్‌ బాస్‌ ఓటీటీ (Bigg Boss OTT) మొదటి సీజనా? అన్నది మాత్రం చెప్పలేదు. అయితే సోషల్‌ మీడియాలో మాత్రం ఓటీటీ సీజన్‌ అయ్యుంటుందని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో దీనికి ఎవరు హోస్టింగ్‌ (Balakrishna Host) చేస్తారన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆరో సీజన్‌కు నాగార్జునను తప్పించి.. మరో స్టార్‌ హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)ను రంగంలోకి దింపుతున్నారట మేకర్స్. ఇదే నిజమయితే నటసింహం తన పంచ్ డైలాగులతో అభిమానులు అలరించడం ఖాయం.


Also Read: AP Theaters closed: మా వల్ల కాదు..ఏపీలో 55 థియేటర్లకు స్వచ్ఛందంగా తాళాలేసిన యజమానులు
 
బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఇప్పటికే ఆహాలో అన్‌స్టాపబుల్‌ షోలో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అక్కడ తన మ్యాజిక్ ఇప్పటికే చూపించారు. ఇక బిగ్‌ బాస్‌ షోను బాలయ్యకు అప్పగిస్తే.. హోస్టింగ్‌, ఎంటర్‌టైనింగ్‌ వేరే లెవల్‌లో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.  బిగ్‌ బాస్‌ తొలి సీజన్‌కు ఎన్టీఆర్‌, రెండో సీజన్‌కు నాని హోస్ట్‌గా వ్యవహరించగా.. మూడు, నాలుగు, ఐదో సీజన్లకు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించారు. గత మూడు సీజన్లుగా నాగార్జున ఆకట్టుకున్నా.. మేకర్స్ ఈసారి సరికొత్తగా బాలయ్య బాబుని రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తున్నారు. 


Also Read: Ravi Shastri Comments: రవి శాస్త్రి సంచలన వ్యాఖ్యలు.. స్పోర్ట్స్ బెట్టింగ్​కు దేశంలో చట్టబద్దత కల్పించాలి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook