Veera Simha Reddy Trailer: ఒంటి చేత్తో ఊచకోత కోస్తా ** కొడకా..పూనకాలు తెప్పిస్తున్న వీరసింహారెడ్డి ట్రైలర్!
Veera Simha Reddy Trailer: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా మారింది. ఆ వివరాలు
Nandamuri Balakrishna Veera Simha Reddy Trailer: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ఒంగోలు శివార్లలో జరుగుతోంది. ఇక జనవరి ఆరో తేదీన చెప్పినట్లుగానే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు సినిమా నిర్మాతలు. ఇక ఈ ట్రైలర్ ఆద్యంతం నందమూరి అభిమానులను అలరించే విధంగా సాగింది. ఇక రెండు నిమిషాల 24 సెకండ్ల పాటు సాగిన ఈ ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకునే విధంగా సాగింది.
‘’సీమలో పుట్టిన వారెవరూ కత్తి పట్టకూడదని నేనొక్కడినే కత్తి పట్టానని, పరపతి కోసమో, పెత్తనం కోసమో కాదు అది ముందు తరాలు నాకు ఇచ్చిన బాధ్యత’’ అని బాలయ్య పేర్కొన్నారు. ‘’నాది ఫ్యాక్షనిజం కాదు సీమ మీద ఎఫెక్షన్, వీర సింహారెడ్డి అంటూ మీసాలు మెలేస్తున్న నందమూరి బాలకృష్ణ ఒక్కసారిగా అభిమానులందరికీ పూనకాలు తెప్పించాడు. ఇక పుట్టింది పులిచెర్ల, పెరిగింది అనంతపురం, రూలింగ్ కర్నూల్ అంటూ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.
ఇక ఫారెన్ లో ఒక ఫైట్ సందర్భంగా నువ్వు ఎవరు అని అవతలి వ్యక్తి అడుగుతుంటే పది నిమిషాల్లో క్లోజ్ అయ్యే పబ్బు దగ్గరికి వెళ్ళు నేనెవరో తెలుస్తుంది అంటూ బాలయ్య చెప్పడం కూడా అభిమానులను అలరించే విధంగా సాగింది. ఇక మరోపక్క శృతిహాసన్, హనీ రోజ్, చంద్రికల రవి వంటి వారితో వేసిన డాన్స్ లు కూడా ఆకట్టుకునే విధంగా సాగాయి. ఇక అపాయింట్మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడను, లొకేషన్ చూడను, ఒంటి చేత్తో ఊచకోత కోస్తా నా కొడకా అంటూ చెప్పిన డైలాగులు అలరిస్తున్నాయి.
ఇక ‘’సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో, కానీ ఆ చరిత్ర సృష్టించిన వారి పేరు మారదు, మార్చలేరు అంటూ బాలకృష్ణ ఎమోషనల్ గా చెప్పిన డైలాగ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విషయంలో జగన్ ను ఉద్దేశించి చెప్పింది అంటూ ఆయన అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
ఇక శృతిహాసన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాని గోపీచంద్ మలినేని తెరకెక్కించారు. క్రాక్ తర్వాత గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. కన్నడ స్టార్ నటుడు దునియా విజయ్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ ఆయన భార్య పాత్రలో కనిపిస్తుంది. మలయాళ స్టార్ యాక్టర్ లాల్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మరో మలయాళ నటి హనీ రోజ్ కూడా ఒక కీలకపాత్రలో కనిపించబోతోంది.
Also Read: Prabhas Broke into Tears: షోలో కన్నీటి పర్యంతం అయిన ప్రభాస్, బాలకృష్ణ.. హగ్ చేసుకుని మరీ!
Also Read: Tunisha Sharma Death: తునీషా శవమై ఉంటే సీక్రెట్ గర్ల్ ఫ్రెండ్ తో షీజాన్ ఛాటింగ్.. గంట పాటు అలాగే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook