Anasuya Bharadwaj in michael trailer సందీప్ కిషన్ హీరోగా మైఖెల్ సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. ఇందులో విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. అనసూయ సైతం ఎమోషనల్ రోల్‌లో కనిపిస్తోంది. ఈ ట్రైలర్‌ను కాసేపటి క్రితమే బాలయ్య రిలీజ్ చేశాడు. అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ట్రైలర్ రిలీజ్ చేసిన బాలయ్య.. తెగ ఎగ్జైట్ అవుతూ వచ్చాడు. ట్రైలర్ ప్రారంభం అయిన తరువాత అందులో అనసూయ కనిపించింది. ఆమె అనసూయ కదా? అనసూయ ఉందా? ఇందులో అని బాలయ్య అడిగాడు. అవునండి.. ఇందులో అనసూయ ఉంది.. వరలక్ష్మీ గారు కూడా ఉన్నారు అని చెబుతారు. ఓహో వరలక్ష్మీ కూడా ఉందా? అని బాలయ్య ఎంతో ఆసక్తిగా ట్రైలర్ చూస్తాడు.


ఇక అలా ట్రైలర్‌లో బాలయ్య తన పేరుని పిలవడంతో అనసూయ స్పందించింది. అవును బాలయ్య బాబు గారు.. నేనున్నాను.. అంటూ మురిసిపోయింది. ఇక ఈ ట్రైలర్ మాత్రం ఫుల్ ప్యాక్డ్‌గా ఉంది. యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయి. సందీప్ కిషన్ నటన, లాస్ట్ షాట్, సిక్స్ ప్యాక్ లుక్ అన్నీ కూడా అదిరిపోయాయి.


 



విజయ్ సేతుపతి లుక్, గౌతమ్ మీనన్ వాయిస్ ఓవర్, అప్పియరెన్స్, డైలాగ్స్ అన్నీ కూడా సూపర్బ్‌గా ఉన్నాయి. ఒక అమ్మాయి కోసం ఇదంతా చేస్తున్నావా? అంటూ చివర్లో ప్రశ్నను వదలడం.. అవును అంటూ హీరో రెచ్చిపోవడం.. అమ్మాయి కోసం కాకపోతే ఇంకెవరి కోసం బతుకుతాం అంటూ చెప్పిన డైలాగ్ ఎంతో ఇంటెన్సిటీతో కనిపిస్తోంది. మైఖెల్ సినిమాతో సందీప్ కిషన్‌కు హిట్ వచ్చేలానే కనిపిస్తోంది.


అసలే ఇప్పుడు వీర సింహా రెడ్డి సక్సెస్‌లో బాలయ్య ఊపు మీదున్నాడు. అందుకే ఇలా ట్రైలర్ ఈవెంట్‌లోనూ ఫుల్ జోష్‌లో కనిపించాడు. మరి బాలయ్య బాబు చేయి పడటంతో ఈ ప్రాజెక్ట్ దశ ఏమైనా మారుతుందా? అన్నది చూడాలి.


Also Read:  Honey Rose Drinking : బాలయ్యతో కలిసి మందు కొడుతోందిగా.. హనీ రోజ్ యవ్వారం మామూలుగా లేదే


Also Read: Thaman Trolls : ఇక్కడ శివుడంటాడు.. అక్కడ చచ్చినా పర్లేదంటాడు.. తమన్ అతి డైలాగులపై సెటైర్లు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి