Bhagavanth kesari First Song Out: బాలయ్య, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న మూవీ 'భగవంత్ కేసరి'(Bhagavanth Kesari). ఇందులో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. మరో కీలకపాత్రలో లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల(Sree Leela) కనిపించనుంది. అఖండ, వీరసింహారెడ్డి వంటి సూపర్ హిట్స్ తర్వాత నటసింహం నుంచి వస్తున్న సినిమా కావడంతో మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ అడియెన్స్ ను ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. షైన్ స్క్రీన్స్ సినిమాస్ పతాకంపై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. వినాయక చవితి నేపథ్యంలో తెరకెక్కిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇందులో బాలకృష్ణ, శ్రీలీల మాస్ స్టెప్పులతో అదరగొట్టారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ పాటను కాసర్ల శ్యామ్ రచించగా.. కరీముల్లా, మనీషా పంద్రకీ ఈ సాంగ్‍ను అలపించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. గణేశ్ ఉత్సవాలకు సరిగ్గా సూటయ్యేలా ఈ సాంగ్ ను కంపోజ్ చేశారు మేకర్స్. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ దసరా కానుకగా అడియెన్స్ ముందుకు రానుంది. ఈ చిత్రం అక్టోబరు 19న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. 


Also Read: Kushi movie Review: విజయ్‌ దేవరకొండ ఖుషీ మూవీ హిట్టా? ఫట్టా?


ప్రేక్షకుల నాడీ తెలిసిన డైరెక్టర్స్ లో అనిల్ రావిపూడి ఒకరు. అడియెన్స్ కు కావాల్సిన అన్ని అంశాలను తన చిత్రాల్లో ఉండేలా చూసుకుంటారు అనిల్. అందుకే ఆయన హిట్స్ మీద హిట్స్ కొడుతున్నారు. రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, గ్లింప్స్ చూస్తుంటే బాలయ్యకు కూడా భారీ విజయాన్నే అందించేలా ఉన్నారు అనిల్. ఈ సినిమాతో బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు అభిమానులు.



Also Read: Rajinikanth: 'జైలర్' కు భారీ లాభాలు.. రజినీకి రూ.100 కోట్ల చెక్కు, కాస్ట్‌లీ కారు బహుమతిగా ఇచ్చిన కళానిధి మారన్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook