Nandamuri Mokshagna Teja Strong Counter To ysrcp Leaders who Slamming Balakrishna: ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయం మీద జూనియర్ ఎన్టీఆర్ ఒకరకంగా నందమూరి బాలకృష్ణ ఒక రకంగా స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ స్పందన సరిగా లేదని టిడిపి అభిమానులు ఆయన మీద సోషల్ మీడియా వేదికగా గట్టిగానే టార్గెట్ చేసి కామెంట్ చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే బాలకృష్ణ మాత్రం మార్చేయడానికి తీసేయడానికి ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదని అది ఒక సంస్కృతి, ఒక నాగరికత, తెలుగుజాతి వెన్నుముక అంటూ సుదీర్ఘ పోస్ట్ ఒకటి రాసుకు వచ్చారు. తండ్రి గద్దెనిక్కి ఎయిర్ పోర్టు పేరు మార్చితే కొడుకు గద్దెనికి యూనివర్సిటీ పేరు మారుస్తున్నాడని మిమ్మల్ని మార్చడానికి ప్రజలు ఉన్నారు, పంచభూతాలు ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త అంటూ ఫేస్బుక్ పేజ్ వేదికగా ఆయన చేసిన కామెంట్లు కలకలం రేపాయి.


అక్కడ ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలు ఉన్నారు, పీతలు ఉన్నారు, విశ్వాసం లేని వాళ్ళని చూసి కుక్కలు సైతం తలదించుకుంటున్నాయి. శునకాల ముందు తలదించుకు బతికే సిగ్గులేని బతుకులు అంటూ బాలకృష్ణ తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో వైసిపి కూడా దానికి గట్టిగానే కౌంటర్ ఇస్తూ దాదాపుగా మంత్రివర్గంలో ఉన్న అందరి మంత్రుల ట్విట్టర్ అకౌంట్ల నుంచి నందమూరి బాలకృష్ణను టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు వచ్చాయి.



దీనికి టిడిపి అభిమానులు, నందమూరి బాలకృష్ణ అభిమానులు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పుడు తాజాగా నందమూరి మోక్షజ్ఞ తేజ అంటే నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ తేజ పేరుతో ఉన్న ఒక ట్విట్టర్ అకౌంట్ నుంచి ఒక ఘాటు ట్వీట్ రావడం ఆసక్తికరంగా మారింది. బాలయ్య మీద గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో మొరుగుతున్న కొన్ని కుక్కలకు అంటూ సంబోధించిన ఆయన మీరు ఎంత చేసినా బాలయ్య వెంట్రుక కూడా పీక్కోలేరు అవసరం ఉన్నప్పుడు అందరూ ఆయన కాళ్ల దగ్గరికి వచ్చిన వారే అవసరం తీరిపోయాక కారు కూతలు కూస్తే కాలమే సమాధానం చెబుతుంది అంటూ మోక్షజ్ఞ తేజ పేరుతో ఉన్న అకౌంట్ నుంచి ఒక ట్వీట్ వచ్చింది.


అయితే ఈ అకౌంట్ నిజంగా నందమూరి మోక్షజ్ఞదేనా లేక ఆయన పేరుతో నందమూరి అభిమానులు నడిపిస్తున్నారా అనే విషయం మీద క్లారిటీ లేదు. ఆ అకౌంట్ ను గనక పరిశీలిస్తే నందమూరి మోక్షజ్ఞ అఫీషియల్ అనే పేరుతో ఉంది. దీనికి 14,200 మంది ఫాలోవర్స్ ఉన్నారు. నందమూరి మోక్షజ్ఞ తేజ టీం అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిలని ట్విట్టర్ అకౌంట్ బయోలో పేర్కొన్నారు. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లెజెండ్ సినిమా షూటింగ్లో మోక్షజ్ఞ ఫోటోలు బయటకు రావడంతో అప్పటినుంచి ఆయన సినీ రంగ ప్రవేశం చేస్తారంటూ రకరకాల ప్రచారాలు జరిగాయి. బాలకృష్ణ కూడా తన కుమారుడి సినీ రంగ ప్రవేశం కోసం రంగ సిద్ధమవుతుందని చెబుతున్నారు కానీ ఎప్పుడు ఏ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అనే విషయం మీద మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు.


Also Read: Brahmastra Ticket Rates: టికెట్ల రేట్లు మళ్లీ తగ్గించిన బ్రహ్మాస్త్ర యూనిట్.. ఇక మూడు రోజులు టికెట్ రేట్లు ఇలా!


Also Read: Chiranjeevi Clarity on Political Dialouge: పొలిటికల్ డైలాగ్‌పై స్పందించిన చిరంజీవి.. ఒక రకంగా మంచిదే అంటూ!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook