Brahmastra Ticket Rates: టికెట్ల రేట్లు మళ్లీ తగ్గించిన బ్రహ్మాస్త్ర యూనిట్.. ఇక మూడు రోజులు టికెట్ రేట్లు ఇలా!

Huge Drop in Brahmastra Ticket Rates After Mega National Cinema Day Success: నేషనల్ సినిమా డే రోజు కలెక్షన్స్ బాగా రావడంతో బ్రహ్మాస్త్ర యూనిట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 25, 2022, 05:26 PM IST
Brahmastra Ticket Rates: టికెట్ల రేట్లు మళ్లీ తగ్గించిన బ్రహ్మాస్త్ర యూనిట్.. ఇక మూడు రోజులు టికెట్ రేట్లు ఇలా!

Huge Drop in Brahmastra Ticket Rates After Mega National Cinema Day Success: రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా బ్రహ్మాస్త్ర పార్ట్ శివ 1 సినిమా ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదలైంది. తెలుగు సహా మిగతా దక్షిణాది భాషల్లో ఈ సినిమాని రాజమౌళి సమర్పిస్తూ విడుదల చేశారు. అయితే సెప్టెంబర్ 23వ తేదీన నేషనల్ సినిమా డేగా జరుపుకుంటున్నట్లు ప్రకటించిన సినిమా యూనిట్ ఈ సినిమాకు కేవలం ఆరోజు 75 రూపాయలు మాత్రమే టికెట్ ధర నిర్ణయించారు.

మల్టీప్లెక్స్ లో కూడా 75 రూపాయలకే టికెట్లు లభించడంతో ప్రేక్షకులందరూ ఈ సినిమాను చూడడానికి ఆసక్తి చూపించారు. అందుకే దాదాపుగా సినిమా ధియేటర్లలో ఆరోజు 85% ఆక్యుపెన్సీ కనిపించింది. దీంతో సినిమా విడుదలైన మూడవ శుక్రవారం నాడు గురువారంతో పోలిస్తే 250% కలెక్షన్లు పెరిగాయి. హిందీ కలెక్షన్స్ లో ఈ సినిమా జోరు చూపింది. దీంతో టికెట్ రేట్ తగ్గిస్తే ప్రేక్షకులు సినిమా చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారనే విషయం అర్థం చేసుకున్న సినిమా యూనిట్ ఇప్పుడు తమ సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన ప్రకటన చేశారు.

అది ఏమిటంటే మరింత మంది ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడమే ధ్యేయంగా 6వ తేదీ నుంచి 29వ తేదీ వరకు కేవలం 100 రూపాయలు దానికి జీఎస్టీ కలిపి టికెట్ రేటు కలెక్ట్ చేసి సినిమా ప్రదర్శిస్తామని పేర్కొన్నారు. భారీగా రేట్లు తగ్గించిన నేపద్యంలో ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారని సినిమా యూనిట్ భావిస్తుంది. అయితే తెలుగులో ఇప్పటికే రైట్స్ అమ్మిన దాని కంటే ఎక్కువే డబ్బులు వచ్చాయి కానీ సినిమా యూనిట్ అయితే మరింత ఎక్స్పెక్ట్ చేసింది.

ఈ నేపథ్యంలో ఇప్పుడు సినిమాని తక్కువ రేట్లకే ప్రదర్శిస్తున్నారు కాబట్టి సినిమాను చూసే ప్రేక్షకుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. మరి చూడాలి ఏం జరగబోతోంది? ఈ సినిమాకి కలెక్షన్లు పెరగబోతున్నాయా? లేదా? అనేది. ఇక ఈ సినిమాని కరణ్ జోహార్ సహా రణబీర్ కపూర్, డైరెక్టర్ అయాన్ ముఖర్జీ సంయుక్తంగా నిర్మించారు. నాలుగు బడా ప్రొడక్షన్స్ సంస్థలు కూడా సినిమా నిర్మాణంలో భాగమయ్యాయి.

Also Read: Roja Counter to Balakrishna: చంద్రబాబు మీద పగ తీర్చుకో.. తేడా వస్తే దబిడి దిబిడే.. బాలయ్యపై రోజా ఘాటు వ్యాఖ్యలు

Also Read: Prabhas in Ayodhya: ఆ రోజున అయోధ్యలో ఆదిపురుష్ టీజర్ లాంచ్.. రావణ దహనం కూడా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News