Nandamuri Taraka Ratna's Death News: నందమూరి తారక రత్న ఇక లేరు. జనవరి 27న కుప్పంలో నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్న సందర్భంగా గుండెనొప్పితో కుప్పకూలి తీవ్ర అస్వస్థతకు గురైన తారక రత్న అప్పటి నుంచి బెంగళూరులోని హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. ఒకానొక దశలో నందమూరి తారక రత్నను మరింత మెరుగైన చికిత్స కోసం ఎయిర్ అంబులెన్స్‌లో విదేశాలకు తరలించనున్నట్టు వార్తలొచ్చాయి. కానీ ఏ కారణం చేతో అది కుదరలేదు. అలా క్రిటికల్ కండిషన్‌లో చికిత్స పొందుతూనే నేడు అనారోగ్యం మరింత విషమించడంతో ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తారక రత్న స్టార్ హీరోగా పేరు తెచ్చుకోలేకపోయినప్పటికీ.. తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. మరే ఇతర సినీ పరిశ్రమలోనూ ఏ ఇతర స్టార్ హీరోకు సాధ్యపడని అరుదైన రికార్డు తారక రత్నకే సాధ్యమైంది. సినిమాల్లోకి వచ్చిన కొత్తలోనే ఒకేసారి ఏకంగా 9 సినిమాలకు సైన్ చేసి తారక రత్న అరుదైన రికార్డు తన సొంతం చేసుకున్నారు. ఇది తారక రత్నకు మాత్రమే సాధ్యమైన రికార్డు.


ఇదిలావుంటే, తారక రత్న మృతి నేపథ్యంలో తారక రత్నకు సంబంధించిన అంశాలన్ని మరోసారి ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతున్నాయి. తారకరత్న ఎవరు ? నందమూరి వంశంలో ఎవరి కుమారుడు ? తారక రత్న చరిత్ర ఏంటి అనే కోణంలో ( Who is Taraka Ratna, Taraka Ratna's Father) ఇంటర్నెట్లో అన్వేషణ జరుగుతోంది.


నందమూరి తారకరత్న గురించి వెదికే క్రమంలోనే నందమూరి అభిమానులకు, నెటిజెన్స్‌కి ఇంటర్నెట్లో కనిపిస్తున్న మరో వివాదం ఏంటంటే.. నందమూరి తారకరత్నను ఉపయోగించి జూనియర్ ఎన్టీఆర్‌ని తొక్కేయడానికి కుట్ర జరిగిందా అనే వివాదం హైలైట్ అవుతోంది. ఈ వివాదం ఈ ఇద్దరు హీరోలు సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఆఫ్ ది రికార్డ్ వినిపించిన హాట్ టాపిక్. 


యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌కి పోటీగానే నందమూరి తారకరత్న ఇండస్ట్రీలోకి వచ్చారా ? నందమూరి వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్‌కి యాక్సెప్టెన్స్ లేని రోజుల్లోనే ఆయన్ను సినిమాల్లో నందమూరి వారసుడిగా ఎదగనివ్వకుండా చేయడానికి స్వయంగా నందమూరి కుటుంబంలోనే కుట్ర జరిగిందా ? అందుకే నందమూరి తారకరత్నను తారక్‌కి పోటీగా సినిమాల బరిలోకి దించారా ? అందువల్లే నందమూరి కుటుంబం నుంచి వస్తున్న హీరో అనే గుర్తింపు జూనియర్ ఎన్టీఆర్‌కి దక్కకుండా ఉండేందుకే తారకరత్నకు ఒకేసారి ఏకంగా 9 సినిమాలకు సైన్ చేసే అవకాశం వచ్చిందా ? ఒకేసారి 9 సినిమాలు తారకరత్నను వెదుక్కుంటూ వచ్చాయా ? లేక వచ్చేలా చేశారా ? ఈ కుట్ర వెనుక దాగి ఉన్న ముసుగు వీరులు ఎవరు ? జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లోకి రావడం, క్రేజ్ తెచ్చుకోవడం ఇష్టం లేని వారే తారక రత్నను వెనుకుండి నడిపించారా ? ఇవి అప్పట్లో ఇండస్ట్రీలో కొంతమంది నోట వినిపించిన సందేహాలు. అప్పట్లో ఫిలింనగర్లో ఇదొక ఇంట్రెస్టింగ్ టాపిక్.


ఇక ఇదే విషయమై కొన్ని నెలల క్రితం ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా నందమూరి తారకరత్ననే సమాధానం ఇచ్చారు. ఇండస్ట్రీలో కొంతమంది ఆరోపిస్తున్నట్టుగా జూనియర్ ఎన్టీఆర్‌ని తొక్కేయడానికే తనను సినిమాల్లోకి తీసుకొచ్చారనే ఆరోపణలో అసలు ఏ మాత్రం వాస్తవం లేదని తారక రత్న వివరించారు. తారక్ తనకు తమ్ముడు అవుతాడని.. తాను ఇండస్ట్రీలోకి రావడానికంటే ముందుగానే ఆది లాంటి సూపర్ హిట్ సినిమా చేసి తారక్ మంచి ఫామ్‌లో ఉన్నాడని తెలిపారు. నందమూరి కుటుంబం నుంచి అందరిలాగే తానూ వచ్చాను కానీ తాను తమ్ముడికి పోటీగా అస్సలే రాలేదు. అదంతా ఉత్తుత్తి గాసిప్స్ మాత్రమే అని కొట్టిపారేశారు. ఆమాటకొస్తే.. ఇప్పటికీ నందమూరి వంశాన్ని ముందుకు తీసుకువెళ్తున్న ఓ స్టార్ హీరోగా తారక్ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అందుకు సంతోషం. మాలో ఎవరైతేనేం.. తాత గారి పేరును, నందమూరి వంశాన్ని ముందుకు తీసుకువెళ్తే చాలు అనే కోరుకుంటాను. అందుకే తారక్‌ని చూస్తే తాను గర్వంగానే ఫీల్ అవుతానని నందమూరి తారక రత్న చెప్పుకొచ్చారు. నిజంగానే తారక రత్న మనస్తత్వం ఎంత గొప్పదో కదా..


ఇది కూడా చదవండి : Taraka Ratna Death: శివరాత్రి నాడే తారకరత్న కన్నుమూత.. తీవ్ర విషాదంలో నందమూరి కుటుంబం


ఇది కూడా చదవండి : Taraka Ratna Death Live Updates: తారకరత్న కన్నుమూత.. హైదరాబాదు బయలుదేరిన పార్ధివ దేహం!


ఇది కూడా చదవండి : Taraka Ratna Biography: ప్రపంచంలో మరే హీరోకి సాధ్యం కాని రికార్డు.. పెద్దలను ఎదిరించి పెళ్లి.. తారకరత్న గురించి ఈ విషయాలు తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook