Taraka Ratna Passed Away: సుమారు 23 రోజులుగా చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న నందమూరి తారకరత్న కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా వైద్యులు కొద్దిసేపట్లో ప్రకటించే అవకాశం కనిపిస్తోంది నారా లోకేష్ ప్రారంభించిన యువ గళం అనే ఒక పాదయాత్ర ప్రారంభోత్సవం రోజున తారకరత్న కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్న తారకరత్న అందులో భాగంగానే పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్రలో గుండె నొప్పితో కుప్పకూలిన తారకరత్నను కుప్పం నుంచి బెంగళూరు హృదయాలయ హాస్పిటల్ కు తరలించారు.
కోమాలో ఉన్న ఆయనకు 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స అందించారు, స్పందించక పోవడంతో వెంటనే విదేశీ వైద్యులను కూడా రప్పించి వైద్యం అందించారు. మొదటి రోజు నుంచి ఇప్పటి నుంచి ఎటువంటి ఇంప్రూవ్ మెంట్ లేకపోగా ఇన్ ఫెక్షన్ల సమస్య పెరిగిన క్రమంలో ఆయన కన్నుమూశారని అంటున్నారు. సొంతంగా శ్వాస తీసుకోలేని స్థితిలో ఆయనకు ECMO లైఫ్ సపోర్టింగ్ కూడా పెట్టారని, ఆర్గాన్ ఫెయిల్యూర్, గుండె కండరాలు పనిచేయపోవడం వల్ల ఎక్మో ద్వారా రక్త ప్రసరణ జరిపి డయాలిసిస్ కూడా చేశారని అంటున్నారు.
ఇక ఆయన బ్రెయిన్ డెడ్ అవడంతో విదేశాల నుంచి రప్పించిన వైద్యులు చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదని, కోలుకునే అవకాశాలు లేవని వైద్యులు భావించడంతో లైఫ్ సపోర్టింగ్ సిస్టం తొలగించే విషయమై కుటుంబ సభ్యులతో హాస్పిటల్ మేనేజ్ మెంట్ చర్చించిందని తెలుస్తోంది. ఈ క్రమంలో కుటుంబ సభ్యుల అనుమతితో ఎక్మో తొలగించినట్టు సమాచారం అందుతున్నా ఈ విషయం మీద అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇక భారీగా బరువు పెరుగడం, చిన్న వయసులో డయాబెటిస్ రావడం,వల్ల తారకరత్న గుండెకు ఇబ్బంది ఏర్పడిందని అంటున్నారు. హృదయ స్పందన నిల్చి పోయిన స్థితిలో ఆసుపత్రికి తరలించగా రక్త సరఫరా నిల్చిపోవడం వల్ల మెదడు దెబ్బతిన్నదని, ఆ ప్రభావం మిగిలిన అవయవాల పైనా పడిందని అంటున్నారు. ఫిబ్రవరి 22న తారకరత్న 40 వ పుట్టిన రోజు ఉండగా సరిగ్గా నాలుగు రోజుల ముందే కన్నుమూయడం మరింత బాధాకరం.
Also Read: Taraka Ratna Death Live Updates: తారకరత్న కన్నుమూత.. అంత్యక్రియలు ఎప్పుడంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook