Nandamuri Taraka Ratna Died 4 Days Before Birthday: నందమూరి తారకరత్న మరణంతో నందమూరి అభిమానులందరూ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కేవలం నందమూరి అభిమానులు మాత్రమే కాదు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు, ఆ పార్టీ కార్యకర్తలు సైతం తీవ్ర విషాదంలో మునిగి పోయిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే నందమూరి తారకరత్న జీవితం గురించి అనేక విశేషాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ఒక కీలకమైన అంశం బయటకు వచ్చింది. అదేమిటంటే సరిగ్గా నాలుగు రోజులలో పుట్టినరోజు జరుపుకోవాల్సిన ఆయన అనారోగ్య కారణాలతో కన్నుమూశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నందమూరి తారకరత్న ఫిబ్రవరి 22 1983 వ సంవత్సరంలో నందమూరి మోహనకృష్ణ- శాంతి అనే దంపతులకు జన్మించారు. నందమూరి మోహనకృష్ణ ఎన్టీఆర్ కుమారుల్లో ఒకరు కాగా కొన్ని సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో హీరోగా పరిచయమైన నందమూరి తారకరత్న మొదటి సినిమాతోనే హిట్ అందుకున్నాడు.ఆ సినిమాకి వచ్చిన సక్సెస్ తో ఆయన ఒకేరోజు ఏకంగా తొమ్మిది సినిమాలో ప్రారంభోత్సవం జరిపి ప్రపంచవ్యాప్తంగా మరే హీరో సాధించలేని రికార్డు సాధించాడు. అయితే బాధాకరమైన విషయం ఏమిటంటే ఆ తొమ్మిది సినిమాలలో కేవలం మూడు సినిమాలు మాత్రమే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలయ్యాయి.


మరో ఆరు సినిమాలు పట్టాలెక్కకుండానే ఆగిపోయాయి. సినీ అవకాశాలు లేకపోవడంతో తర్వాత విలన్ గా కూడా మారిన తారకరత్న అమరావతి అనే సినిమాలో విలన్ పాత్రకు గాను నంది అవార్డు సైతం అందుకున్నాడు. రవిబాబు దర్శకత్వంలో భూమిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో మంచి హిట్ అయింది.  ఇక ఇప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా వచ్చిన అవకాశాలను అందుకుంటూ చేసుకుంటూ వెళుతున్నాడు తారకరత్న.  రాజకీయాలలో యాక్టివ్ కావాలని భావిస్తున్న ఆయన తెలుగుదేశంలో సైతం యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.


అందులో భాగంగానే తన బావ నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభమవుతుందన్న సంగతి తెలుసుకొని పాదయాత్రలో పాల్గొనేందుకు ఆయన కూడా కుప్పం వెళ్లారు. అలా వెళ్ళిన మనిషి మళ్ళీ తిరిగి రాలేదు. కుప్పంలో హార్ట్ స్ట్రోక్ గురై కింద పడిపోవడంతో హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తరలించారు టీడీపీ శ్రేణులు. అయితే 45 నిమిషాల పాటు ఆయన గుండె కొట్టుకోవడం ఆగిపోవడంతో మెదడుకు రక్తప్రసరణ ఆగిపోయిందని దీంతో మెదడులోని ఒక కీలక భాగం దెబ్బతిన్నదనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సరిగ్గా పుట్టినరోజుకి నాలుగు రోజులు ముందు చనిపోవడం మరింత బాధ కలిగిస్తోందని ఆయన అభిమానులు సినీ వర్గాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Also Read: Taraka Ratna Unlucky: 9 నెంబర్ అసలు కలిసిరాని తారకరత్న.. అందుకే ఇలా అయిందా?


Also Read: Taraka Ratna Siva Devotee: శివుని భక్తునిగా నటించి శివరాత్రి రోజే శివైక్యం.. శివుని ఆన లేనిదే చీమైనా కుట్టునా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook