Taraka Ratna Comments on Jr NTR Political Entry యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ తొలినాళ్లలో ఎంతగా ఇబ్బంది పడ్డాడో అందరికీ తెలిసిందే. నందమూరి హీరోల నుంచి సరైన ఆదరణ దక్కలేదు. నందమూరి ఫ్యామిలీ కూడా పూర్తిగా ఎన్టీఆర్‌ను దూరం ఉంచేదన్న టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. బాబాయ్ బాలయ్య, సోదరులు కళ్యాణ్‌ రామ్, తారకరత్న ఇలా ఎవ్వరూ కూడా ఎన్టీఆర్‌తో సన్నిహితంగా మెలిగే వారు కాదని అనేవారు. ఇక ఎన్టీఆర్‌కు పోటీగానే తారకరత్న కూడా వరుసగా సినిమాలు చేశాడని అంటుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కానీ చివరకు ఎన్టీఆర్ ఒక్కడే నిలదొక్కుకున్నాడు. నందమూరికి అసలు సిసలు వారసుడు అనిపించుకుంటున్నాడు. టీడీపీ పగ్గాలు కూడా ఎన్టీఆర్ చేపట్టాలని ఓ వర్గం ఆశిస్తుంటుంది. ఎన్టీఆర్ వచ్చినప్పుడే పార్టీ బాగుపడుతుందని అంటుంటారు. కానీ ఎన్టీఆర్ వస్తే.. లోకేష్ పరిస్థితి అయోమయంగా మారుతుందని చంద్రబాబు భయపడుతుంటాడని, అందుకే ఎన్టీఆర్‌ను దూరంగా ఉంచుతున్నాడనే టాక్ కూడా వస్తుంటుంది.


 



అయితే తాజాగా ఈ ప్రశ్నలన్నీ తారకరత్నకు ఎదురయ్యాయి. వాటిపై తారకరత్న ఎంతో గొప్పగా స్పందించాడు. టీడీపీ తాత గారు పెట్టిన పార్టీ.. మా అందరి పార్టీ.. ఇందులో అందరూ వస్తారు.. సరైన టైంలో అందరూ వస్తారు అని ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ మీద స్పందించాడు. 


ఎన్టీఆర్ నా తమ్ముడు.. నందమూరి రక్తం.. నందమూరి బిడ్డ.. నా తమ్ముడి మీద నాకు ఎప్పుడూ ప్రేమే ఉంటుంది అని, అన్నదమ్ముల మధ్య ఎలాంటి బంధం ఉంటుందో తమ మధ్య కూడా అలాంటి బంధమే ఉంటుందని తారకరత్న చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.


Also Read : Chiranjeevi Nenoka Natudni : 'నేనొక నటుడ్ని'.. అల్పసంతోషిని, దేవుడ్ని, జీవుడ్ని.. చిరు మాటల ప్రవాహాం


Also Read : Gautam Ghattamaneni Birth Issue : రోజుకు గ్రా. 10 పెరగాల్సిందేనట.. గౌతమ్‌ పుట్టిన సమయంలో వచ్చిన సమస్య ఇదే.. నమ్రత ఎమోషనల్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook