Chiranjeevi Nenoka Natudni : 'నేనొక నటుడ్ని'.. అల్పసంతోషిని, దేవుడ్ని, జీవుడ్ని.. చిరు మాటల ప్రవాహాం

Nenoka Natudni From Ranga Marthanda కృష్ణవంశీ మార్క్‌ కనిపించేలా రంగమార్తాండ ఉండబోతోందని తాజాగా వచ్చిన షాయరీ చెప్పేస్తోంది. ఇందులో చిరంజీవి గొంతులోంచి వచ్చిన మాటలు అందరి మనసులను స్పృశించేలా ఉంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 21, 2022, 12:04 PM IST
  • రంగమార్తాండ నుంచి తెలుగు షాయరీ
  • నేనొక నటుడ్ని అంటూ చిరు కవితాఝరి
  • దేవుడ్ని, జీవుడ్ని, విటుడ్ని అంటూ సాగిన పాట
Chiranjeevi Nenoka Natudni : 'నేనొక నటుడ్ని'.. అల్పసంతోషిని, దేవుడ్ని, జీవుడ్ని.. చిరు మాటల ప్రవాహాం

Chiranjeevi Nenoka Natudni చిరంజీవి గంభీరమైన గాత్రంలో చెప్పిన నేనొక నటుడ్ని తెలుగు షాయరీ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో తన గురించి తానే చెప్పుకున్నట్టుగా అనిపిస్తోంది. కానీ ఓ నటుడు జీవన శైలి ఎలా ఉంటుంది.. రంగస్థల నటుడి జీవితం ఎలా ఉంటుంది? అనేది ఎంతో గొప్పగా వర్ణించారు. ఎంత గొప్పగా రాశారో.. అంతే గొప్పగా చిరంజీవి చెప్పాడు. దానికి తగ్గట్టుగా ఇళయరాజా మంచి బాణీని అందించాడు.

 

నేనొక నటుడ్ని.. చమ్‌కీలబట్టలు వేసుకుని, అట్ట కిరీటం పెట్టుకుని, చెక్క కత్తి పట్టుకుని, కాగితాల పూల వర్షంలో కీలుగుర్రంపై స్వారీ చేసే చక్రవర్తిని నేను.. కాలాన్ని బంధించిన శాసించగల నియంతని నేను.. నేనొక నటుడ్ని.. నాది కాని జీవితాలకు జీవం పోసే నటుడ్ని.. నేను కాని పాత్రల కోసం వెతికే విటుడ్ని.. వేషం కడితే అన్ని మతాల దేవుడ్ని.. వేషం తీస్తే ఎవ్వరికీ ఏమీ కానీ జీవుడ్ని.. అంటూ ఇలా సాగుతూ పోయిన షాయరీని చిరంజీవి ఎంతో గొప్పగా చెప్పాడు.

 

ఇక ఇందులో లక్ష్మీ భూపాల రాసిన మాటలు చూస్తుంటే అది చిరంజీవి కోసమే రాసినట్టుగా అనిపిస్తుండటం విశేషం. ఇక చిరంజీవి మాట్లాడిన మాటలు, చెప్పిన తీరుకు తగ్గట్టుగా ఇళయరాజా తన సంగీతాన్ని అందించడం మరో విశేషం. మొత్తానికి రంగమార్తాండ సినిమా ఎలా ఉండబోతోందో.. అందులో కథా నేపథ్యం ఏంటి.. రంగస్థల నటుల గురించి ఎంత గొప్పగా చెప్పబోతోన్నాడనే విషయాన్ని కృష్ణ వంశీ ఇలా హింట్ ఇచ్చి వదిలేశాడు.

రంగమార్తాండ సినిమా మరాఠీలో వచ్చిన నటసామ్రాట్ అనే సినిమాకు రీమేక్‌ అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రకాష్‌ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, అనసూయ, శివాత్మిక, రాహుల్ సిప్లిగంజ్ ఇలా ఎంతో మంది ముఖ్య పాత్రలను పోషించారు.

Also Read : Pawan Kalyan Fans : మోసం చేస్తారు, వాడుకుంటారు..బండ్ల గణేష్‌ ట్వీట్లు.. మోసాన్ని బయటపెట్టేసిన పవర్ స్టార్ ఫ్యాన్స్

Also Read : Gautam Ghattamaneni Birth Issue : రోజుకు గ్రా. 10 పెరగాల్సిందేనట.. గౌతమ్‌ పుట్టిన సమయంలో వచ్చిన సమస్య ఇదే.. నమ్రత ఎమోషనల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News