Nandamuri Tejaswini to start a New Production House: సినీ రంగంలో వారసులు రంగ ప్రవేశం చేయడం అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. నిర్మాతల పిల్లలు, హీరోలు అవడం హీరోయిన్ అవ్వడం లేదంటే హీరో హీరోయిన్ల పిల్లలు నటీనటులు అవ్వడం లేదా నిర్మాతలు అవడం వంటివి సాధారణంగానే జరుగుతూ ఉంటాయి, ఇప్పుడు మరో సినిమా కుటుంబానికి చెందిన వ్యక్తి సినీ రంగ ప్రవేశానికి రంగం సిద్ధమైందని అంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒక సంవత్సరంలో నందమూరి బాలకృష్ణ ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది. అన్ స్టాపబుల్ కంటే ముందు అన్ స్టాపబుల్ కంటే తర్వాత అన్నట్లుగా ఆయన ఇమేజ్ మారిపోయింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక ఆయన రెండో సీజన్ కూడా ఇప్పుడు ప్రసారమవుతోంది. ఈ ఓటీటీ టాక్ షోకి ఒక క్యాప్షన్ ఉంది. దెబ్బకు థింకింగ్ మారిపోవాలా అన్నట్లుగా వాళ్ళు ఎందుకు ఆ క్యాప్షన్ పెట్టారో తెలియదు కానీ నిజంగానే షో చూసిన తర్వాత అందరి థింకింగ్స్ మారిపోతున్నాయి.


బాలకృష్ణలో మరో కోణాన్ని చూపించిన ఈ షో వెనుక ఆయన కుమార్తె నందమూరి తేజస్విని ఉందనే విషయం సినీవర్గాల వారికి తప్ప బయట వారికి ఎవరికీ తెలియదు. నందమూరి బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని ఈ షోకి క్రియేటివ్ కన్సల్టెంట్ గా వ్యవహరిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ డేట్స్ చూడటం అలాగే మిగతా కార్యక్రమాలన్నీ ఆవిడే చూసుకుంటూ ఉంటారు. ఆఖరికి తన తండ్రి బట్టలు ఎలా ఉండాలో కూడా ఆమె సజెస్ట్ చేస్తూ ఉంటారట. అంతే కాదని ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ఏమిటంటే తేజస్విని బాలకృష్ణ మూవీ సెలక్షన్స్ విషయంలో కూడా దృష్టి పెడుతున్నారని అంటున్నారు.


ఆమె త్వరలో ఒక ప్రొడక్షన్ హౌస్ కూడా ప్రారంభించే అవకాశం ఉందని అంటున్నారు. ఆ ప్రొడక్షన్ హౌస్ ద్వారా ముందుగా నందమూరి బాలకృష్ణతోనే సినిమా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాక ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ సెలక్షన్ కూడా అయిందని ఈ సినిమాకు డైరెక్టర్ని కూడా త్వరలోనే ఫైనల్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ కమిట్మెంట్ ఇచ్చిన సినిమాలు పూర్తయిన తర్వాత ఈ సినిమా ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది.


సాధారణంగా సినీ పరిశ్రమకు మగ పిల్లలు మాత్రమే ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం ఎక్కువగా ఆడపిల్లలు కూడా ఎంట్రీ ఇచ్చి నిర్మాతలుగా మారుతున్నారు. ఇప్పటికే నాగార్జున కుటుంబం నుంచి వచ్చిన సుప్రియ, నిర్మాతగా పలు ప్రాజెక్టులు చేస్తూ ఉండగా నిహారిక కూడా ప్రొడ్యూసర్ గా కొనసాగేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మెగాస్టార్ కుమార్తె సుస్మిత, కృష్ణ కుమార్తె ఘట్టమనేని మంజుల వంటి వారు కూడా నిర్మాతలుగా సెటిలైతున్న నేపథ్యంలో తేజస్విని కూడా అదే బాట ఎంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తున్న వార్తలు హాట్ టాపిక్ గా మారాయి.


Also Read: Kantara Telugu Openings: 'కాంతార'ను హత్తుకున్న తెలుగోడు.. కన్నడ కంటే మనదగ్గరే ఎక్కువ ఓపెనింగ్స్!


Also Read: Rangasthalam Golden Chance: గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న రంగస్థలం మేకర్స్.. అలా చేసుంటేనా వేరే రేంజ్ అంతే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook