Nani hikes 20% remuneration with Dasara Sucess: దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని సూపర్ హిట్ అందుకున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే కాదు నాని కెరీర్ లోనే 100 కోట్లు కొల్లగొట్టిన సినిమాగా నిలిచింది. నిజానికి ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కానీ తెలుగు మార్కెట్లో మాత్రమే ఈ సినిమాకి మంచి వసూళ్లు వస్తున్నాయి. మిగతా భాషల పరిస్థితి పక్కన పెడితే సినిమా నిర్మాత సహా కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్ వరకు చాలా వరకు సేఫ్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. నాని ఎట్టకేలకు తన కెరీర్ లో మొట్టమొదటి 100 కోట్ల సినిమాను టచ్ చేయడంతో ఇప్పుడు ఆయన తన రెమ్యునరేషన్ పెంచబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు నాని 20 కోట్ల రెమ్యూనరేషన్ మార్క్ చేరుకోలేదు.


ఇది కూడా చదవండి: Prashanth Neel- Prabhas: ఇండియన్ సినీ హిస్టరీలో భారీ బడ్జెట్ తో మైధలాజికల్ మూవీ.. దిల్ రాజు బడా ప్లాన్!


ఈ సినిమా హిట్ అయిన నేపథ్యంలో 20 శాతం రెమ్యునరేషన్ పెంచిన క్రమంలో ఆయన 20 కోట్ల రెమ్యూనరేషన్ మార్క్ చేరుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా జరుగుతున్నప్పుడే నాని తన 30వ సినిమా మోహన్ చెరుకూరి నిర్మాణంలో ప్రకటించారు. మైత్రి మూవీ మేకర్స్ నుంచి బయటకు వచ్చిన మోహన్ చెరుకూరి కొత్త నిర్మాణ సంస్థ ఏర్పాటు చేశారు.  శౌర్యవ్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది.


ఈ సినిమాతో పాటు నాని డివివి దానయ్య నిర్మాతగా డివివి ఎంటర్టైన్మెంట్స్ లో కూడా ఒక సినిమా ఒప్పుకున్నాడు.  దర్శకుడు ఎవరు అనే విషయం మీద ప్రస్తుతానికి క్లారిటీ లేకపోయినా వివేక్ ఆత్రేయతోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తం మీద నాని రెమ్యూనరేషన్ పెంచిన వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇక ఇప్పుడు దసరా వసూళ్లు శాకుంతలం, రుద్రుడు, విడుదల సినిమాలు రిలీజ్తో బ్రేకులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రావణాసుర ముందే వచ్చినా పెద్దగా వసూళ్ల మీద ఎఫెక్ట్ చూపించలేకపోయింది.


ఇది కూడా చదవండి: Chiranjeevi Fancy Number: లగ్జరీ కారుకు ఫాన్సీ నెంబర్ కొనేసిన చిరు.. ఎన్ని లక్షలో తెలుసా?



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook