Prashanth Neel- Prabhas: ఇండియన్ సినీ హిస్టరీలో భారీ బడ్జెట్ తో మైధలాజికల్ మూవీ.. దిల్ రాజు బడా ప్లాన్!

Prashanth Neel- Prabhas Mythological Drama: ప్రభాస్ తో ఒక భారీ ప్రాజెక్ట్ సెట్ చేయాలని చూస్తున్న దిల్ రాజు ప్రశాంత్ నీల్ కాంబోలో ఒక మైథలాజికల్ ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నట్టు తెలుస్తోంది.   

Written by - Chaganti Bhargav | Last Updated : Apr 12, 2023, 07:56 PM IST
Prashanth Neel- Prabhas: ఇండియన్ సినీ హిస్టరీలో భారీ బడ్జెట్ తో మైధలాజికల్ మూవీ.. దిల్ రాజు బడా ప్లాన్!

Prashanth Neel- Prabhas mythological drama Movie: పెద్ద స్టార్స్ లేకుండానే భారీ బడ్జెట్ వెచ్చించి మరీ ఒక బంపర్ హిట్ అందుకున్నాడు కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. నిజానికి అప్పటికి యష్ కన్నడలో ఒక రేంజ్ హీరోనే కానీ కేజిఎఫ్ సినిమా తోనే ఆయనకు సూపర్ స్టార్డం ఏర్పడింది. అలా కేజిఎఫ్ స్టార్ గా యష్ స్థిరపడేందుకు కారణమైన ప్రశాంత్ నీల్ చరిష్మా ఇప్పుడు దేశవ్యాప్తంగా మారు మోగిపోయింది. కేజిఎఫ్. కేజీఎఫ్ 2 సినిమాలతో ప్రశాంత్ నీల్ మంచి క్రేజ్ దక్కించుకున్నాడు. ప్రస్తుతానికి ఈ దర్శకుడు ప్రభాస్ హీరోగా సలార్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇది ఒక గ్యాంగ్స్టర్ డ్రామా అనే ప్రచారం ముందు నుంచి జరుగుతోంది. అయితే కేజిఎఫ్ సిరీస్ కి ఈ సలార్ సినిమాకి ఏదో తెలియని లింక్ ఉందనే ప్రచారం చాలా రోజుల నుంచి జరుగుతోంది. ఆ సంగతి ఎలా ఉన్నా ఈ సినిమా పూర్తయిన వెంటనే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో సినిమా అనౌన్స్ చేశాడు.

ఇదీ చదవండి: Sanjay Dutt Injured: షూటింగ్లో బాంబ్ బ్లాస్ట్.. సంజయ్ దత్ కి తీవ్ర గాయాలు

హోంబలే ఫిలింస్ బ్యానర్లో ఆ సినిమా తెరకెక్కాల్సి ఉంది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో దిల్ రాజు ఒక ఎగ్జైటింగ్ కొత్త ప్రాజెక్టు గురించి అనౌన్స్మెంట్ ఇచ్చేసాడు, అదేమిటంటే ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో భారత దేశ సినీ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్ తో నిర్మించబోయే ఒక సినిమా సెట్ చేస్తానని అన్నారు. అయితే ఇది మాస్ మసాలా సబ్జెక్ట్ కాదని ఒక మైదలాజికల్ డ్రామా అని చెప్పుకొచ్చారు. నిజానికి ఈ ప్రాజెక్టు గురించి దిల్ రాజు ఒకపక్క ప్రభాస్ తో మరోపక్క ప్రశాంత్ నీల్ తో కూడా సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. అంతా ఫైనల్ అయిన తర్వాత ఈ అంశానికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన కూడా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభాస్ మున్నా, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాలు దిల్ రాజు ప్రొడక్షన్లోనే చేశారు. ఆ తర్వాత ప్రభాస్ తో చేయడానికి దిల్ రాజుకు సరైన ప్రాజెక్టు సెట్ అవ్వడం లేదు. ప్రశాంత్- ప్రభాస్ కాంబినేషన్ అయితే ఎన్ని కోట్లు పెట్టడానికైనా తాను సిద్ధం అనే విధంగా ఉన్నారు దిల్ రాజు చూడాలి మరి ఏం జరగబోతోంది.
ఇదీ చదవండి: Sanjay Dutt Injured: షూటింగ్లో బాంబ్ బ్లాస్ట్.. సంజయ్ దత్ కి తీవ్ర గాయాలు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

 

Trending News