Jersey: జెర్సీ 2 ఎవరితో చేసుకుంటారో మీ ఇష్టం.. నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Jersey 2: నేచురల్ స్టార్ నాని కెరియర్ లో జెర్సీ సినిమాకి ఎంత ప్రత్యేక స్థానం ఉందో చెప్పనవసరం లేదు. ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీలో సైతం ఒక క్లాసిక్ చిత్రంగా మిగిలిపోయింది. అలాంటి ఈ చిత్ర సీక్వెల్ గురించి నాని కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు..
Nani Jersey: నాని హీరోగా శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా వచ్చిన ఎమోషనల్ డ్రామా జెర్సీ. ఈ సినిమా నాని కెరియర్ లోనే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక క్లాసిక్ సూపర్ హిట్ గా నిలిచిపోయింది. ఈ చిత్రం ఈ మధ్యనే రీ-రిలీస్ అయ్యి కూడా మంచి కలెక్షన్ సాధించింది. ఈ సినిమాలో నాని యాక్టింగ్ కి అప్పట్లో ఎన్నో ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రాన్ని దర్శకుడు గౌతమ్ హిందీలో సైతం రీమేక్ చేశారు. ఇక ఎన్ని ప్రశంసలు అందుకున్న ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందేమో అని నాని అభిమానులు తెగ ఎదురు చూస్తుండగా ఈ సినిమా సీక్వెల్ గురించి నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
తాజాగా అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి నాని చీఫ్ గెస్ట్ గా వెళ్ళాడు. ఈ ఈవెంట్లో అభిమానులు అందరూ నాని స్టేజి పైన మాట్లాడుతూ ఉండగా జెర్సీ 2 సినిమా ఎప్పుడు చేస్తారు అని అడగడం మొదలుపెట్టారు. ఈ ప్రశ్నకు నాని సమాధానమిస్తూ.. ‘నేను లేను కదా.. జెర్సీ 2 ఎవరితో చేసుకుంటారో చేసుకోండి’ అని చెప్పారు. అసలు విషయానికి వస్తే ఎంతో ఎమోషనల్ డ్రామాగా జరిగే జెర్సీ సినిమా క్లైమాక్స్ లో నాని పాత్ర చనిపోతుంది అన్న విషయం మన అందరికీ తెలిసిందే. దీంతో నానితో సీక్వెల్ తీయలేరు కాబట్టి నాని ఇలా ఎవరితో చేసుకుంటారో చేసుకోండి అని బాగా చెప్పారు.
ఒకవేళ నిజంగా జెర్సీ 2 తీస్తే పెద్దయ్యాక నాని కొడుకు పాత్రలో నటించిన హరీష్ కళ్యాణ్ తో తీయాలి. మరి జెర్సీ 2 వస్తుందా.. వస్తే అంత సూపర్ హిట్ అయిన సినిమాని హరీష్ కళ్యాణ్ హీరోగా పెట్టి దర్శకుడు తీస్తారా అన్న విషయం డైరెక్టర్ గౌతమ్ కి లేదా చిత్ర నిర్మాతలకే తెలియాలి. కానీ సీక్వెల్స్ నడుస్తున్న ఈ క్రమంలో ఈ చిత్రానికి సీక్వెల్ వస్తే మాత్రం ప్రేక్షకులలో అంచనాలు తప్పక ఉంటాయి.
Also Read: Revanth Reddy: ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడిస్తే పథకాలు ఆగిపోతాయి: రేవంత్ హెచ్చరిక
Also Read: Harish Rao: రేవంత్ రెడ్డికి ఏడుపాయల దుర్గమ్మ ఉసురు తగులుతుంది: హరీశ్ రావు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter