Harish Rao: రేవంత్‌ రెడ్డికి ఏడుపాయల దుర్గమ్మ ఉసురు తగులుతుంది: హరీశ్‌ రావు

Harish Rao Fire On Revanth Reddy In Medak Election Campaign: లోక్‌సభ ఎన్నికల్లో మెదక్‌ స్థానం హాట్‌ హాట్‌ రాజకీయాలకు వేదికగా మారింది. మెదక్‌ రాజకీయాలు రేవంత్ రెడ్డి వర్సెస్‌ హరీశ్‌ రావుగా మారాయి. మరోసారి రేవంత్‌పై హరీశ్ రావు విరుచుకుపడ్డారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 21, 2024, 10:52 PM IST
Harish Rao: రేవంత్‌ రెడ్డికి ఏడుపాయల దుర్గమ్మ ఉసురు తగులుతుంది: హరీశ్‌ రావు

Harish Rao: తెలంగాణ రాజకీయాల్లో మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గం కేంద్రంగా అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రేవంత్‌ రెడ్డి చేసిన విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్న హరీశ్ రావు.. మరోసారి ఘాటుగా స్పందించారు. మెదక్‌ ఎంపీ సీటుపై సవాళ్లు, విమర్శల ధాటి పెంచారు. ఇందిరాగాంధీ మోసం చేస్తే కేసీఆర్ నెరవేర్చాడని హరీశ్ రావు తెలిపారు.

Also Read: Harish Vs Revanth: కొడంగల్‌లో ఓడితే రేవంత్‌ రెడ్డి ఎందుకు సన్యాసం తీసుకోలే? హరీశ్‌ రావు

 

మెదక్‌ ఎంపీగా పోటీ చేసిన సమయంలో మెదక్‌ను జిల్లా చేస్తామని చెప్పి ఇందిరాగాంధీ మోసం చేసిందని హరీశ్ రావు గుర్తు చేశారు. మెదక్‌ జిల్లా కలను నెరవేర్చింది కేసీఆర్ అని స్పష్టం చేశారు. జిల్లానే కాదు గోదావరి జలాలు, సాగునీరు అందించింది కేసీఆర్‌ అని చెప్పారు. రేవంత్ చెప్పవన్నీ అబద్ధాలే అని కొట్టిపారేశారు. నామినేషన్‌కు వెళ్లిన కలెక్టరేట్ కట్టింది కేసీఆర్, నిన్ను మెదక్‌కు రప్పించిన ఘనత కేసీఆర్‌ది అని పేర్కొన్నారు.

Also Read: Harish Rao: చీము నెత్తురు ఉన్నోళ్లు ఎవరూ కాంగ్రెస్‌, బీజేపీకి ఓటేయరు: హరీశ్ రావు వ్యాఖ్యలు

 

'మెదక్‌కు రైలు తెచ్చింది కేసీఆర్. వంద కోట్లు ఖర్చు చేసి రైల్వే లైన్ తెచ్చాడు. మూడు జిల్లాలు చేసి, మూడు వైద్య కళాశాలలు ఏర్పాటుచేశాడు. చిట్టచివరి ఆయకట్టుకు నీళ్లిచ్చాడు. ఇంత చేసినా కేసీఆర్ ఏమీ చేయలేదంటున్నావు' అని హరీశ్ రావు వివరించారు. ఏడుపాయల అమ్మవారికి కేసీఆర్ రూ.వంద కోట్లు ఇస్తే రేవంత్‌ రెడ్డి వెనక్కి తీసుకున్నావు అని ఆరోపించారు. రేవంత్‌ రెడ్డికి ఏడుపాయ అమ్మవారి ఉసురు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు.

'అబద్ధాలు ఆడడంలో రేవంత్‌కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి' అని హరీశ్‌ రావు ఎద్దేవా చేశారు. 'ఉరికిచ్చి కొడ్తా, పేగులు మెడలే వేసుకుంటా, బొందపెడ్తా, మానవ బాంబునవుతా అంటున్నావు.  ఇవేనా సీఎం మాట్లాడ్లాల్సింది?' అని మరోసారి ప్రశ్నించారు. హామీల గురించి అడిగితే హెచ్చరిస్తున్నావు.. కేసులు పెడుతున్నావని చెప్పారు. 'డిసెంబ్ 9వ తేదీన రుణమాఫీ చేస్తానని వంద రోజులు దాటినా చేయనందుకు చెంపలేసుకుని 60 లక్షల మంది రైతులకు క్షమాపణ చెప్పు' అని హరీశ్ రావు సవాల్‌ విసిరారు. 'మాట తప్పడం, అబద్ధాలు ఆడడం రేవంత్ నైజం' అని విమర్శించారు.

'బీఆర్‌ఎస్‌ పార్టీ మెదక్‌ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని లోకల్.. ఆయన మెదక్‌లోనే స్థిరపడిన ఓటర్. కొడంగల్‌లో ఓడిపోయి మల్కాజిగిరికి పోయింది నువ్వు' అని గుర్తు చేశారు. 'నా ఎత్తుతో రేవంత్‌కు ఏం పని?' అని ప్రశ్నించారు. రైతుల గురించి ఆలోంచి, సమస్యలు పరిష్కరించాలని హితవు పలికారు. అహంకారంతో గాల్లో తేలుతున్న కాంగ్రెస్ భూమ్మీదికి రావాలంటే వెంకట్రామిరెడ్డిని పార్లమెంటుకు వెళ్లాలి అని తెలిపారు.

'అకాల వర్షాలతో కష్టాల పాలైన రైతులను పరామర్శించడానికి రేవంత్‌ రెడ్డికి ఒక్క నిమిషం టైమ్ దొరకడం లేదా?' అని హరీశ్‌ రావు ప్రశ్నించారు. సొంత పార్టీ నాయకులు వీహెచ్, మోత్కుపల్లిలనే కలవడం లేదు.. ఇదేనా ప్రజా పాలన? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలను లాక్కునే బదులు ప్రజల కష్టాలు తీర్చు అని సూచించారు. కేసీఆర్‌ను తిడుతూ కాలక్షేపం చేయడం కాదు హామీలను నెరవేర్చు అని హితవు పలికారు. మెదక్‌లో గెలిచేది బీఆర్ఎస్‌ పార్టీనే అని ధీమా వ్యక్తం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News