Dasara Collection in Nizam Area నాని, కీర్తి సురేష్‌లు జంటగా నటించిన దసరా సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సునామిని క్రియేట్ చేస్తోంది. నాని, కీర్తి సురేష్‌ల పర్ఫామెన్స్ ఒకెత్తు అయితే.. మొదటి సినిమాతో ఇంత రస్టిక్ అండ్ రా మెటీరియల్‌తో తీయడం శ్రీకాంత్ ఓదెల టాలెంట్‌కు నిదర్శనంగా నిలుస్తుంది. ప్రతీ ఒక్కరూ శ్రీకాంత్ ఓదెల పనితనం గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు దసరా సినిమా వరల్డ్ వైడ్‌గా దుమ్ములేపేస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆల్రెడీ ఈ సినిమా ఓవర్సీస్‌లో మిలియన్ డాలర్ మార్క్‌ను దాటేసింది. మిలియన్ క్లబ్బులో సినిమా చేరడం మామూలు విషయం కాదు. స్టార్ హీరోల సినిమాలే మిలియన్ మార్క్‌ను దాటడం లేదు. అలాంటి దసరా సినిమా ఫస్ట్ డే, ప్రీమియర్ కలెక్షన్లతోనే ఈ ఫీట్‌ను అందుకుంది. మొదటి రోజు అయితే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 38 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. దగ్గరదగ్గరా ఈ సినిమా 19 కోట్ల షేర్‌ను కలెక్ట్ చేసింది.


అయితే ఈ సినిమా నైజాం ఏరియాలో కొత్త రికార్డులు క్రియేట్ చేసినట్టుగా తెలుస్తోంది. రెండు రోజుల్లోనే అక్కడ బ్రేక్ ఈవెన్ అయినట్టుగా సమాచారం అందుతోంది. దిల్ రాజు ఆ ఏరియాను తొమ్మిది, పది కోట్లకు కొనేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ మొత్తం ఈ రెండు రోజుల్లోనే వచ్చినట్టుగా టాక్ వినిపిస్తోంది. అయితే కొంత మంది మాత్రం నైజాం ఏరియా పదమూడు, పదిహేను కోట్లకు అమ్ముడు పోయినట్టుగా చెబుతున్నారు. పది కోట్ల వరకు అయితే రెండ్రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయినట్టు. అదే పదమూడు, పదిహేను కోట్లు అంటే.. ఈరోజుతో బ్రేక్ ఈవెన్ అయ్యేలా ఉంది.


ఈ సినిమా వంద కోట్ల వరకు వెళ్తుందని అంతా అనుకుంటున్నారు. కేవలం తెలుగులోనే వంద కోట్ల గ్రాస్ రాబడుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ చిత్రం ఓవర్సీస్‌లోనూ అనుకోని విధంగా ఆడేస్తోంది. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్‌కే బ్రేక్ ఈవెన్ అయ్యేలా ఉంది. యాభై కోట్ల షేర్ రాబడితే లాభాల బాట పట్టినట్టే అవుతుంది. ఇప్పటికే ఇరవై కోట్ల షేర్ వచ్చినట్టుగా సమాచారం అందుతోంది. మరి ఈ సినిమా మున్ముందు ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.


Also Read:  Honey Rose Pics : బాప్‌ రే అనిపించేలా హనీ రోజ్ భారీ అందాలు.. కత్తుల్లాంటి చూపుల్తో కిక్కిస్తోన్న భామ


Also Read: Nithiin Fans : ఫ్లాప్ డైరెక్టర్‌తో నితిన్ సినిమా.. హర్ట్ అయిన అభిమాని.. హీరో రిప్లై ఇదే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook