Dasara 4 Days Collections: ఇరగమరగ చేస్తున్న `దసరా` సినిమా.. నాని దెబ్బకు బాక్సాఫీస్ షేక్!
![Dasara 4 Days Collections: ఇరగమరగ చేస్తున్న 'దసరా' సినిమా.. నాని దెబ్బకు బాక్సాఫీస్ షేక్! Dasara 4 Days Collections: ఇరగమరగ చేస్తున్న 'దసరా' సినిమా.. నాని దెబ్బకు బాక్సాఫీస్ షేక్!](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/styles/zm_500x286/public/2023/04/03/268076-dasaranizam.jpg?itok=xFE1rLu8)
Dasara 4 Days Collections in Nizam Area: నాని దసరా సినిమాకు కాస్త లాంగ్ వీకెండ్ దొరికింది. నాలుగు రోజుల్లో దసరా దుమ్ములేపేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అంతటా హౌస్ ఫుల్ కలెక్షన్లతో ఆడేసింది. నాని కెరీర్లో మొదటి సారిగా వంద కోట్ల బొమ్మ పడింది.
Dasara Movie 4 Days Collections in Nizam: నేటివిటీకి దగ్గరగా ఉన్న సినిమాలు తీస్తే ఇప్పుడు జనాలు ఇరగబడి చూస్తున్నారు. బ్రహ్మరథం పడుతున్నారు. పెద్ద హిట్ చేస్తున్నారు. అలానే ఇప్పుడు తెలంగాణ నేపథ్యంలో వచ్చే సినిమాలు పెద్ద హిట్ అవుతున్నాయి. వాటికి నైజాం ఏరియాలో మంచి ఆదరణ లభిస్తోంది. అసలు ఏ సినిమాకైనా సరే నైజాం అనేది బంగారు గని లాంటిది. ఇక్కడి నుంచి అధిక మొత్తంలో షేర్ వస్తుంటుంది. మహేష్, పవన్ వంటి హీరోలకు నైజాంలో అదిరిపోయే కలెక్షన్లు వస్తుంటాయి.
అయితే ఇప్పుడు నాని దసరా సినిమాతో పెద్ద హీరోల రికార్డులను సైతం చెరిపేసేలా ఉన్నాడు. తెలంగాణ, సింగరేణి నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించడంతో నైజాంలో ఎక్కువగా హాట్ టాపిక్ అవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకు రివ్యూల పరంగా మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ మౌత్ టాక్ మాత్రం అద్భుతంగా కలిసి వచ్చింది.
ఇక నైజాం ఏరియాలో నాని సత్తా చాటుతున్నాడు. నాలుగో రోజు కూడా దాదాపు నాలుగు కోట్ల షేర్ రాబట్టినట్టుగా సమాచారం. అయితే ఈ నాలుగు రోజుల లెక్కలు చూస్తే దిమ్మ తిరిగి పోవాల్సిందే. ఈ నాలుగు రోజుల్లో దాదాపు 18 కోట్ల షేర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. రెండ్రోజుల్లోనే నైజాం ఏరియాలో బ్రేక్ ఈవెన్ కొట్టేశాడు. ఈ లెక్కలు చూస్తుంటే దసరాకు నైజాంలో డబుల్, త్రిబుల్ ప్రాఫిట్‌లు వచ్చేలా ఉన్నాయి.
అయితే ప్రపంచ వ్యాప్తంగా నాలుగు రోజుల్లో నాని దసరా సినిమాకు తొంభై కోట్ల వరకు గ్రాస్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఓవర్సీస్‌లో అయితే ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయింది. 1.5 మిలియన్ డాలర్లను క్రాస్ చేసేలా కనిపిస్తోంది. లాంగ్ రన్‌లో ఈ సినిమా రెండు మిలియన్ల డాలర్ల క్లబ్‌లోకి వెళ్లి నాని మరో రికార్డ్ క్రియేట్ చేసేలా ఉన్నాడు.
దసరా సినిమాలో కథ కొత్తది కాకపోయినా బ్యాక్ డ్రాప్ కొత్తగా ఉండటం, డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన విధానం, చాలా రోజుల తరువాత కీర్తి సురేష్ తన స్థాయి, సత్తాకు తగ్గట్టుగా నటించడం, నాని రెచ్చిపోయి నటించడం, పాటలు, బీజీఎం ఇలా ప్రతీ ఒక్క విషయంలో ఆడియెన్స్ ఇంప్రెస్ అవ్వడంతో ఈ రేంజ్ కలెక్షన్లు వస్తున్నాయి.
Also Read: Dasara Collection : దసరా ఊచకోత.. అక్కడ కూడా బ్రేక్ ఈవెన్?.. నాని దెబ్బకు బాక్సాఫీస్ బద్దల్
Also Read: Janhvi Kapoor Pics : అందాలను ఒడిసిపట్టినట్టుగా.. కాక పుట్టించేలా జాన్వీ కపూర్ లుక్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook