Nani: ప్రభాస్ సినిమాతో పోటీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన నాని
Nani Reacts About Prabhas Salaar: హాయ్ నాన్న టీజర్ నేడు రిలీజ్ అవ్వగా.. ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఎమోషనల్ జర్నీగా సాగిన టీజర్ తో నాని ఖాతాలో మరో హిట్ పడినట్లేనని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక టీజర్ లాంచ్ ఈవెంట్లో ప్రభాస్ గురించి అలానే సలార్ సినిమా గురించి నాని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.
Nani Reacts About Prabhas Salaar: నాని ప్రస్తుతం హాయ్ నానా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ నుంచి ప్రేక్షకులకు మంచి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తూ వచ్చింది. ఇక ఈరోజు విడుదలైన టీజర్ కూడా ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ సినిమా డిసెంబర్ 7వ తేదీన విడుదల కాబోతోంది.
మరోపక్క ప్రస్తుతం మన తెలుగు హీరో నుంచి రానున్న భారీ పాన్ ఇండియా సినిమా ఏదంటే అది మన డార్లింగ్ ప్రభాస్ సలార్. కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమాకి దర్శకత్వం వహిస్తూ ఉండడంతో మొదటినుంచి ఈ చిత్రంపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లో కూడా ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నాయి. మరో పక్కా ఈ సినిమా విడుదల తేదీ గురించి సినిమా ఇండస్ట్రీలో చాలా టెన్షన్ కూడా ఉంది. ఎందుకు అనగా ఈ సినిమా విడుదల తేదీ బట్టి తమ సినిమాలు పోస్ట్ ఫోన్ చేసుకోవాలి అనుకుంటున్నారు నిర్మాతలు.
ఇక పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాని ఫైనల్ గా డిసెంబర్ 22 కి లాక్ చేసినట్టుగా ఈ చిత్ర మేకర్స్ అనౌన్స్ చేయడంతో అప్పటికే ఆ టైం లో ఉన్న పలు చిత్రాలు రిలీజ్ డేట్ ని వాయిదా వేసుకున్నా. కాగా ఈ భారీ క్లాష్ లో ఉన్న సినిమాలలో మన నాని నటించిన “హాయ్ నాన్న” కూడా ఒకటి.
కాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ లో నాని సలార్ రేస్ లో తప్పుకోవడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ ఈవెంట్ లో ప్రభాస్ సినిమాతో పోటీ గురించి చెబుతూ..' కుటుంబంలో అన్నయ్య ఫంక్షన్ ఉంటే తమ్ముడు మరో డేట్ లో తనది పెట్టుకుంటాడు కదా. మరి ఇది కూడా అంతే. ప్రభాస్ ని నేను నాన్నగా భావిస్తాను అందుకే నా చిత్రాన్ని మరో డేట్ లోకి మార్చుకున్నాను' అని తెలిపాడు.
ఇక ఇలా నాని ప్రభాస్ ని తన అన్న అనడంతో ప్రస్తుతం వీరిద్దరి ఫ్యాన్స్ ఈ వీడియోని సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తూ ఆనంద పడిపోతున్నారు.
Also read: Best Mileage Cars Under Rs 6 Lakhs: జస్ట్ 6 లక్షలకే వచ్చే బెస్ట్ మైలేజ్ కార్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook