Motorola Edge 40 Neo Price: పిచ్చెకించే ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Motorola Edge 40 Neo మొబైల్..డెడ్‌ చీప్‌ ధరకే మీ కోసం..

Motorola Edge 40 Neo Price: త్వరలోనే Motorola కంపెనీ నుంచి స్మార్ట్‌ఫోన్‌ విడుదల కాబోతోంది. అతి తక్కువ ధరతో ప్రీమియం ఫీచర్స్‌తో విడుదల అవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 20, 2023, 03:33 PM IST
Motorola Edge 40 Neo Price: పిచ్చెకించే ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Motorola Edge 40 Neo మొబైల్..డెడ్‌ చీప్‌ ధరకే మీ కోసం..

 

Motorola Edge 40 Neo Price: స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకునేవారికి ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ మోటరోలా గుడ్‌ న్యూస్‌ తెలిపింది. త్వరలోనే మోటరోలా నుంచి మరో స్మార్ట్‌ ఫోన్‌ విడుదల కాబోతోంది. మోటరోలా Edge 40 Neo సిరీస్‌తో విడుదల చేయబోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా కంపెనీ చేసింది. సెప్టెంబర్ 21వ తేదిన ఈ స్మార్ట్‌ఫోన్‌ విడుదల చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇప్పటికే ఈ మొబైల్‌కి సంబంధించిన ధర, ఫీచర్స్‌ వివరాలను టిప్‌స్టర్స్‌ సోషల్‌ మీడియాలో లీక్‌ చేశారు.  Motorola Edge 40 Neoను కంపెనీ మిడ్-రేంజ్‌లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఇక ఈ మొబైల్‌ ఫోన్‌ ఫీచర్స్‌ విషయానికొస్తే..Motorola Edge 40 Neo స్మార్ట్‌ఫోన్‌ 144Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా MediaTek Dimensity 7030 ప్రాసెసర్‌పై ఈ మొబైల్‌ పనిచేస్తుంది. ఈ మొబైల్‌ ఫోన్‌ 50 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు చాలా రకాల ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. 

Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడంటే..?  

Motorola Edge 40 Neo స్మార్ట్‌ఫోన్‌ ధర:
టిప్‌స్టర్‌ అభిషేక్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. భారతదేశంలో Motorola Edge 40 Neo స్మార్ట్‌ఫోన్‌ విడుదలైతే..ధర రూ.24,999గా ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా ఈ మొబైల్‌ ఫోన్‌ విడుదలైన తర్వాత Poco X5 Pro, Samsung Galaxy M53 5G, Realme 10 Pro Plusతో పోటీ పడే ఛాన్స్‌లు ఉన్నాయి. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను రెండు వేరియంట్స్‌లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇక రెండవ వేరియంట్‌ ధర రూ.26,000లోపే ఉండే ఛాన్స్‌లు ఉన్నాయి. 

Motorola Edge 40 Neo సెప్టెంబర్ 21న ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో లభించబోతోంది. ఇప్పటికే ఇ-కామర్స్ వెబ్‌సైట్ ఈ ఫోన్‌కి సంబంధించిన స్పెసిఫికేషన్‌లను పేర్కొన్నారు. ఈ మొబైల్‌ను యూరప్‌ దేశాల్లో ఇప్పటికే విడుదల చేశారు.  Motorola Edge 40 Neo 12GB+256GB స్టోరేజ్ వేరియంట్ EUR 399 (దాదాపు రూ. 35,400)లతో లభిస్తోంది. 

Motorola Edge 40 Neo ఫీచర్లు:
6.55 అంగుళాల పూర్తి HD ప్లస్ 
poLED కర్వ్డ్ డిస్‌ప్లే
1080x2400 పిక్సెల్‌లు
144 Hz రిఫ్రెష్ రేట్‌
ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7030 ప్రాసెసర్‌
 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా
13-మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్
5000mAh బ్యాటరీ
68W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌
Android 13
ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌

Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడంటే..?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x