Nani: నాని టాలీవుడ్ టాప్ స్టార్‌గా రాణిస్తోన్న ఈయన మార్కెట్ పరిధి మాత్రం రూ. 40 కోట్ల నుంచి రూ. 50 కోట్ల మధ్యనే ఉంది. ఓ రకంగా మీడియం రేంజ్ హీరోల్లో ఈ తరహా మార్కెట్ ఉన్నది నానికి మాత్రమే. ఆ తర్వాత  ఒకరిద్దరు హీరోలున్నా.. నటన విషయంలో.. కలెక్షన్స్ విషయంలో ఇప్పటికీ నాని  ఆ విషయంలో తోపు అని చెప్పాలి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లాస్ట్ ఇయర్ నాని.. దసరా వంటి ఊర మాస్ సినిమాతో తన కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ తర్వాత వెంటనే తన మార్క్ ఫ్యామిలీ సెంటిమెంట్ మూవీ 'హాయ్ నాన్న' మూవీతో పలకరించాడు. ఈ రెండు సినిమాలు వేటికవే పూర్తిగా భిన్నమైనవి. దసరా మూవీలో రగ్గ్‌డ్ క్యారెక్టర్‌లో కనిపిస్తే.. హాయ్ నాన్న సినిమాలో ఓ హై రేంజ్ నాన్న పాత్రలో ఎంతో క్లాసీగా నటించి మెప్పించాడు. అయితే నాని ఓ విషయంలో మీడియం రేంజ్ హీరోల్లో తోపుగా నిలిచాడు.  ఆయన నటించిన గత 5 చిత్రాల కలెక్షన్స్ ఇవి నిజమేనని ప్రూవ్ చేస్త్ఉన్నాయి.
ఇక నాని హీరోగా నించిన రీసెంట్ 5 మూవీస్ థియోట్రికల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే..


హాయ్ నాన్న.. బాక్సాఫీస్ దగ్గర ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.60 కోట్ల షేర్ రాబట్టింది.
దసరా మూవీ.. రూ. 63.55 కోట్ల షేర్..
అంటే సుందరానికీ మూవీ.. రూ. 21.35 కోట్ల షేర్..
శ్యామ్ సింగరాయ్ మూవీ.. 26.50 కోట్ల షేర్..
గ్యాంగ్ లీడర్ మూవీ.. రూ. 23.40 కోట్ల షేర్ రాబట్టింది.


అందులో 'వీ', టక్ జగదీష్ సినిమాలు మాత్రం థియేట్రికల్‌గా కాకుండా ఓటీటీ వేదికగా విడుదలై సంచలన విజయం సాధించాయి. మొత్తంగా నాని.. గత 5 చిత్రాల బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే.. 173.40 కోట్ల షేర్ వచ్చింది. ఓ రకంగా మీడియం రేంజ్ హీరోల్లో ఈ రేంజ్ వసూళ్లు రాబట్టిన తోపు హీరో నాని తప్పించి మరోకరు లేరు. 


Also Read: HCA BMW Offer: హైదరాబాద్‌ క్రికెటర్లకు బంపరాఫర్‌.. రూ.కోటి నగదు, బీఎండబ్ల్యూ కారు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి