Nani Movie Shyam Singha Roy Launched: నేచరుల్ స్టార్ నాని ( Actor Nani ) నటిస్తున్న ‘శ్యామ్ ‌సింగ రాయ్’ (Shyam Singha Roy Movie) సినిమా పూజా కార్యక్రమాలతో గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్లుగా సాయి పల్లవి ( Sai Pallavi ), కృతిశెట్టి (Krithi Shetty)  నటిస్తున్నారు. ఈ సినిమా తొలి సన్నివేశానికి నాని తండ్రి గంటా రాంబాబు క్లాప్ కొట్టి ప్రారంభించారు. మెర్లపాక గాంధీ స్విచ్ ఆన్ చేయగా.. అనిల్ రావిపూడి గౌరవ దర్వకత్వం వహించారు. అయితే శ్యామ్ సింగరాయ్ చిత్రం షూటింగ్ రెగ్యూలర్‌గా జరపనున్నట్లు నిర్మాత వెంకట్ బోయినపల్లి తెలిపారు. మునుపెన్నడు చేయని పాత్రలో నాని ఆసక్తికరమైన కథాంశంలో నటించనున్నారని నిర్మాత తెలిపారు. Also read: Ante Sundaraniki : నానీ, అంటే సుందరానికి...



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నాని ( Nani ) నటిస్తున్న శ్యామ్ ‌సింగ రాయ్ (Shyam Singha Roy) చిత్రానికి రాహుల్‌ సంకృత్యాన్‌ (Rahul Sankrityan) దర్శకత్వం వహిస్తుండగా.. నిహారిక ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ( Tollywood ) భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీకి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలో మడోన్నా సెబాస్టియన్‌, రాహుల్‌ రవీంద్రన్‌, మురళీశర్మ, అభినవ్‌ గోమటం ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ప్రస్తుతం నాని ‘టక్ జగదీష్’ (tuck jagadish) సినిమా చేస్తున్నాడు. దీంతోపాటు వివేక్ ఆత్రేయతో దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కించనున్న ‘అంటే.. సుందరానికి’ (ante sundaraniki) అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఇటీవలనే ఈ సినిమా అనౌన్స్‌మెంట్ జరిగింది. Also read: Tamannaah: లిప్‌లాక్.. ఆ హీరోతో అయితే ఓకే


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe