Tuck Jagadish Movie: నాని ‘టక్ జగదీష్’ ఫస్ట్ లుక్ వచ్చేసింది
టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో ప్రస్తుతం బిజీబిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాని `టక్ జగదీష్` సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్‌ను ఇచ్చారు మూవీ మేకర్స్.
Nani Movie ‘Tuck Jagadish’ First Look Released: టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో ప్రస్తుతం బిజీబిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాని 'టక్ జగదీష్' సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్‌ను ఇచ్చారు మూవీ మేకర్స్. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ టక్ జగదీష్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ లుక్ నాని అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇందులో చాలా డీసెంట్‌గా టక్ వేసుకొని అన్నం ముందు కూర్చున్న నాని.. వెనుక నుంచి కత్తి తీస్తూ కనిపించాడు. అయితే ఈ సినిమాలో నాని (Nani).. జగదీష్ నాయుడు అనే పాత్రలో కనిపించనున్నాడు.
టక్ జగదీష్ (Tuck Jagadish ) సినిమాకు శివ నిర్వాణ ( Director Shiva Nirvana ) దర్శకత్వం వహిస్తున్నారు. సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే.. నాని (Nani) సరసన హీరోయిన్స్‌గా రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. వీరితోపాటు ఈ సినిమాలో జగపతిబాబు, నాజర్, రావు రమేష్, నరేష్, మురళీశర్మ సైతం కీలకపాత్రలు పోషిస్తున్నారు. వేసవికాలంలో ఈ సినిమాను విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. Also Read: Nani ‘శ్యామ్ సింగరాయ్’ షురూ
ఇదిలాఉంటే కరోనా నేపథ్యంలో (Tollywood) నాని ఇటీవల నటించిన వీ సినిమా ఓటీటీలో విడుదలపై ప్రేక్షకులని అలరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని జనవరి 1న మళ్లీ థియేటర్స్‌లో విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ వెల్లడించారు. Also read: Ante Sundaraniki : నానీ, అంటే సుందరానికి...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook