Hi Nanna Movie OTT Platform fix: నేచురల్ స్టార్ నాని, సీతారాం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా న‌టించిన 'హాయ్ నాన్న' మూవీ(Hi Nanna Movie) శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ నేపథ్యంలో సాగే ఈ మూవీకి శౌర్యువ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇప్పటికే ఈ మూవీ ప్రీమియర్స్ చూసిన అభిమానులు బాగుందని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. హీరోహీరోయిన్స మధ్య కెమెస్ట్రీ, నాని-బేబీ కియారా మధ్య వచ్చిన సన్నివేశాలు కంటతడి పెట్టించినట్లు అభిమానులు చెబుతున్నారు. సాను జాన్ వ‌ర్గీస్ విజువ‌ల్స్‌, హేష‌మ్ సంగీతం ఆడియెన్స్ ను కట్టిపడిసినట్లు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈ మూవీ ఏ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లోకి వస్తుందా అని మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఫిక్స్ అయినట్లు సమాచారం. హాయ్ నాన్న డిజటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుతుంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ ను రూ.37 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రిప‌బ్లిక్ డే కానుక‌గా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రంలో శృతిహాస‌న్,  ప్రియ‌ద‌ర్శి, అంగ‌ద్ బేది, జ‌య‌రామ్, విరాజ్ అశ్విన్  త‌దిత‌రులు కీల‌కపాత్రల్లో నటించారు. ద‌స‌రా మూవీ తర్వాత నాని నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై వీరలెవల్లో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా బాగానే చేశారు. 


Also Read: Naga Chaitanya: సినిమా ఫ్లాప్ అవుతుందని తెలిసి కూడా నటించిన నాగచైతన్య... కారణం ఇదే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook