Ante Sundaraniki is now streaming on Netflix: ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెలుగు సినీ రంగ ప్రవేశం చేసిన ఘంటా నవీన్ కుమార్ నేచురల్ స్టార్ నానిగా మారిపోయాడు. నాని సినిమా చూస్తున్నంత సేపు అదొక సినిమాలా కాకుండా మన పక్కింటి కుర్రాడిని లైవ్ లో చూస్తుంటే ఎలా ఉంటుందో అలాంటి ఫీలింగ్ కలుగుతుంది. అందుకే ఎక్కువ మంది తెలుగు ప్రేక్షకులు నానీని ఓన్ చేసుకోగలిగారు. ఒకప్పుడు వరుస హిట్ సినిమాలు అందుకున్న నాని ఈ మధ్య కాలంలో సరైన హిట్ సినిమా కోసం పరితపిస్తున్నాడు. శ్యామ్ సింగరాయ్ సినిమాతో ఒక మాదిరి హిట్ అందుకున్న నాని ఆ తర్వాత అంటే సుందరానికి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమాలో నాని సరసన మలయాళ భామ నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటించింది. బ్రోచేవారెవరురా లాంటి సినిమాతో హిట్ అందుకున్న వివేక్ ఆత్రేయ ఈ సినిమా తెరకెక్కించడంతో సినిమా మీద అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. అయితే జూన్ 10వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హిట్ అవుతుంది అనుకుంటే మిశ్రమ స్పందన తెచ్చుకుంది. మైత్రి మూవీ మేకర్స్ సినిమా కాబట్టి మినిమం గ్యారెంటీ సినిమా అవుతుందనుకున్నారు కానీ ఎందుకో ప్రేక్షకులు సినిమాని ఆదరించలేదని చెప్పాలి. 


తెలుగు మలయాళం భాషల్లో విడుదలైన ఈ సినిమాలో నాని ఒక హిందూ కుర్రాడి పాత్రలో నజ్రియా ఒక క్రిస్టియన్ అమ్మాయి పాత్రలో నటించి మెప్పించారు. సినిమా కొంతమేర మిశ్రమ స్పందన తెచ్చుకున్నా కలెక్షన్స్ విషయంలో మాత్రం భారీగానే నష్టపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ తో పోలిస్తే వసూళ్లు దారుణంగా వచ్చాయి. అయితే థియేటర్లలో సరిగా ఆడని సినిమాలో కూడా ప్రస్తుతానికి డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మంచి రెస్పాన్స్ దక్కించుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఎట్టకేలకు అంటే సుందరానికి సినిమా కూడా ఓటీటీలోకి వచ్చేసింది. నెట్ఫ్లిక్స్ లో ప్రస్తుతానికి అంటే సుందరానికి సినిమా స్ట్రీమ్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం థియేటర్లలో మిస్సయిన వారు ఎవరైనా ఉంటే నెట్ఫ్లిక్స్ లో  చూసేయండి మరి.
Also Read: Ketika Sharma Images: కేతిక శర్మ అందాల విందు.. ఢిల్లీ బ్యూటీ గ్లామర్ మరో లెవల్!


Also Read:Krithi Shetty Pics: ముత్యంలా మెరిసిపోతున్న కృతి శెట్టి.. బేబమ్మ అందాలకు కుర్రకారు ఫిదా!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook