Nani remuneration: న్యాచురల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నాని ఇప్పటివరకు రూ. 10 కోట్ల నుంచి 11 కోట్లు వరకు పారితోషికం తీసుకుంటుండగా తాజాగా తన రెమ్యునరేషన్‌ను భారీగానే పెంచేశాడట. నాని చేతిలో ప్రస్తుతం శ్యామ్ సింగ రాయ్, అంటే సుందరానికి సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు ప్రొడక్షన్ స్టేజీలో ఉండగా.. ఆగస్టు తర్వాతి నుంచి మరో సినిమాను పట్టాలెక్కించేందుకు Tuck Jagadish హీరో ప్లాన్ చేసుకుంటున్నాడు. చెరుకూరి సుధాకర్ నిర్మించనున్న ఈ సినిమాకు నాని అక్షరాల రూ. 14 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్టు ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొవిడ్-19 కి చెక్ పెట్టేందుకు కేంద్రం లాక్‌డౌన్ విధించడంతో సినిమా థియేటర్స్ అన్ని మూతపడిన నేపథ్యంలో OTT Business కి అనూహ్యంగా డిమాండ్ ఏర్పడింది. ఇప్పుడు థియేటర్స్ తెరుచుకున్నప్పటికీ.. OTT content కి ఏర్పడిన డిమాండ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. దీంతో నిర్మాతలకు థియేటర్స్ రైట్స్‌పై వచ్చే Income తో పాటు OTT revenue, Hindi dubbing rights కూడా తోడయ్యాయి. అలా నిర్మాతలకు ఆదాయా మార్గాలు పెరగడంతో నటీనటులు సైతం తమ పారితోషికం పెంచుకునే పనిలో పడ్డారు. అందుకే నాని కూడా తన పారితోషికాన్ని అమాంతం పెంచేశాడని ఫిలింనగర్ వర్గాల టాక్. అన్నట్టు నాని నటించిన లేటెస్ట్ సినిమా Tuck Jagadish movie వచ్చే ఏప్రిల్ నెల్లోనే ఆడియెన్స్ ముందుకు రానుంది.


Also read : Ram సినిమాకు సైన్ చేసిన Uppena హీరోయిన్ Krithi Shetty remuneration ఎంతో తెలుసా ?


Krack movie సూపర్ హిట్ అయిన తర్వాత మాస్ మహారాజ Ravi Teja remuneration కూడా రూ. 16 కోట్ల వరకు పెంచిన సంగతి తెలిసిందే. అలాగే ఇదే సినిమాలో రవితేజకు జంటగా నటించిన Actress Shruti Haasan remuneration పెంచినట్టు ఇటీవలే వార్తలొచ్చాయి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook