Shruti Haasan remuneration: సలార్ మూవీ కోసం రేటు పెంచిన శృతి హాసన్

Shruti Haasan's remuneration for Salaar movie: శృతి హాసన్ క్రాక్ మూవీ సక్సెస్ తర్వాత ఫుల్ జోష్‌లో ఉండటమే కాదు... ఫుల్ డిమాండింగ్‌లోనూ ఉంది అంటున్నాయి సినీవర్గాలు. Krack movie కంటే ముందుగా సినిమాల నుంచి కొంత గ్యాప్ తీసుకున్నట్టుగా కనిపించిన శృతిహాసన్‌ ఇక దాదాపు ఫేడౌట్ అయినట్టే అనుకున్నారు.

  • Feb 03, 2021, 00:09 AM IST

Shruti Haasan's remuneration for Salaar movie: శృతి హాసన్ క్రాక్ మూవీ సక్సెస్ తర్వాత ఫుల్ జోష్‌లో ఉండటమే కాదు... ఫుల్ డిమాండింగ్‌లోనూ ఉంది అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. Krack movie కంటే ముందుగా సినిమాల నుంచి కొంత గ్యాప్ తీసుకున్నట్టుగా కనిపించిన శృతిహాసన్‌ ఇక దాదాపు ఫేడౌట్ అయినట్టే అనుకున్నారు. కానీ క్రాక్ సినిమా సక్సెస్ అవడంతో అమ్మడు మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్టయింది.

1 /5

రవితేజ సరసన Krack, పవన్ కల్యాణ్ సరసన Vakeel Saab చిత్రాల కోసం రెగ్యులర్ పారితోషికం మాత్రమే తీసుకున్న శృతి హాసన్... Prabhas సరసన సలార్ మూవీ ఆఫర్ కోసం మాత్రం మరో రూ. 50 లక్షలు అదనంగా డిమాండ్ చేసిందట.

2 /5

Salaar movie కి శృతి హాసన్ డేట్స్ అవసరం ఉందని భావించిన మేకర్స్.. వెంటనే ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఓకే చెప్పారట. కేజీఎఫ్-2 లాంటి భారీ ప్రాజెక్టుని నిర్మించిన నిర్మాతే ఈ సలార్ మూవీని కూడా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 

3 /5

సలార్ మూవీ ప్యాన్-ఇండియా ప్రాజెక్ట్ కావడం.. బాహుబలి, సాహో, Adipurush, రాధే శ్యామ్ లాంటి చిత్రాలకు సైన్ చేసిన Prabhas లాంటి హీరో సరసన చేస్తున్న ఈ చిత్రం Shruti Haasan కెరీర్‌కు మరింత సహాయపడుతుందని సినీవర్గాలు చెప్పుకుంటున్నాయి.

4 /5

సలార్ మూవీ కూడా ఆశించిన రేంజులో సక్సెస్ అయితే... Shruti Haasan remuneration మరింత పెరిగే అవకాశం కూడా లేకపోలేదు.

5 /5

సలార్ మూవీ ప్రస్తుతం రామగుండంలో షూటింగ్ జరుపుకుంటోంది. ప్రభాస్ నటిస్తున్న మరో భారీ ప్రాజెక్ట్ ఆదిపురుష్ షూటింగ్ సైతం ప్రారంభమైంది. ఆదిపురుష్, సలార్ చిత్రాలను ప్రభాస్ సైమల్టేనియస్‌గా షూటింగ్ పూర్తి చేసే విధంగా తన డేట్స్ ప్లాన్ చేసుకుంటున్నాడు. Adipurush movie ని ఓం రావత్ డైరెక్ట్ చేస్తుండగా... Salaar movie ని కేజీఎఫ్-2 ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్నాడు.