2017లో వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని మరో హిట్టుకు రెడీ అయిపోయాడు. ఈసారి 'ఎంసీఏ' అంటూ పలకరిస్తున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కిన చిత్రం 'ఎంసీఏ'.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్‌లను పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఎటువంటి అభ్యంతరాలు లేకుండా యు/ఏ సర్టిఫికేట్ జారీ చేశారు. డిసెంబర్ 21 తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఇప్పటికే ఆడియో, టీజర్, ట్రైలర్‌లకు విశేష స్పందన రావడంతో సినిమా యూనిట్ కూడా హిట్టు ఖాయమే అని భావిస్తోంది. ఈ సినిమాలో నానీ సరసన సాయి పల్లవి నటిస్తోంది. సీనియర్ నటి భూమిక కీలకపాత్రలో కనిపిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యాజిక్ డైరెక్టర్.