Saripoda Sanivaram Trailer Talk: 2023 నాచురల్ స్టార్ నానికి మర్చిపోలేని సంవత్సరంగా మారింది. ఆ సంవత్సరంలో విడుదలైన దసరా హాయ్ నాన్న రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాలు అందుకున్నాయి. ఈ మధ్యనే జరిగిన ఫిలింఫేర్ అవార్డులలో కూడా ఈ రెండు సినిమాలకి భారీ స్థాయిలో అవార్డులు వచ్చాయి. ప్రస్తుతం నాని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా సరిపోదా శనివారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2022లో నాని, నజ్రియా హీరో హీరోయిన్లుగా నటించిన.. అంటే సుందరానికి సినిమాకి దర్శకత్వం వహించిన వివేక్ ఆత్రేయ.. ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహించారు. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. వరుసగా రెండు హిట్లు అందుకున్న నాని ఇప్పుడు ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడతారు.. అని ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 


దానికి తగ్గట్టుగానే ఈ సినిమా మీద క్రేజ్ కూడా రోజురోజుకీ.. పెరుగుతూవస్తోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ను ఇవాళ భారీ ట్రెయిలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి విడుదల చేసింది చిత్ర బృందం. రెండున్నర నిమిషాల నిడివి ఉన్న చిత్ర ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 


ప్రతి సినిమాలాగానే ఈ సినిమాలో కూడా నాని ఒక విభిన్నమైన పాత్ర పోషిస్తున్నారు..అని ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. సినిమా కాన్సెప్ట్ కూడా చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. యముడు చిత్రగుప్తుడు ఇద్దరు ఒకే మనిషిలో.. ఉంటే ఎలా ఉంటుందో.. నాని పాత్ర అలా ఉంటుంది అంటూ సాయికుమార్ ట్రైలర్లు ఇచ్చిన హైప్ సినిమా మీద అంచనాలు మరింతగా పెంచింది. 


ఎస్ జే సూర్య, నాని మధ్య ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని తెలుస్తోంది. లాస్ట్ లో పోతారు.. మొత్తం పోతారు అంటూ నాని చెప్పే డైలాగ్ ట్రైలర్ కి హైలైట్. ప్రియాంక అరుల్ మోహన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. భారీ అంచనాల మధ్య ఆగస్టు 29న ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది.


 



Also Read: Independence Day: కేసీఆర్‌ బాటలోనే రేవంత్‌.. గోల్కొండలోనే స్వాతంత్ర్య సంబరాలు


Also Read: KTR vs Rahul Gandhi: సుంకిశాలపై మాటల యుద్ధం.. రాహుల్‌ గాంధీని లాగిన కేటీఆర్‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter