Nani 30 Movie Update: ఈ సంవత్సరం దసరా సినిమాతో సక్సెస్ అందుకున్నాడు నేచురల్ స్టార్ నాని. ప్రస్తుతం ఈ హీరో తన 30వ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. 'నాని 30' అనే వర్కింగ్ టైటిల్ పై ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఎప్పుడూ కొత్త దర్శకులను ప్రోత్సహించే నేచురల్ స్టార్.. ఈ సారి కూడా శౌర్యవ్ అనే కొత్త డైరక్టర్ కు అవకాశం ఇచ్చాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఈ ఏడాది చివరకిల్లా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రంలో నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా చేస్తోంది. శృతిహాసన్ మరో కీలకపాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమా అప్ డేట్స్ గురించి నాని ఫ్యాన్స్ ఎప్పటి నుంచే ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నాని 30 మూవీ ఫస్ట్ లుక్, గ్లింప్స్ కు సంబంధించిన అప్ డేట్ ను పారాగ్లైడింగ్ చేస్తూ అనౌన్స్ చేశాడు నేచురల్ స్టార్. దీనికి సంబంధించిన చిన్న క్లిప్ ను కూడా పంచుకున్నాడు. ఫస్ట్ లుక్ మరియు గ్లింప్స్ జూలై 13న విడుదల కానున్నట్లు నటుడు వెల్లడించాడు. . హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా నాని 30ని నిర్మిస్తున్నారు.



ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేసే పనిలో ఉన్న మేకర్స్. తండ్రీ-కుమార్తె మధ్య అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతున్నందున.. హలో డాడీ, హాయ్ డాడీ, డియర్ డాడీ లాంటి పేర్లను పరిశీలిస్తున్నారట మేకర్స్. దాదాపు 'హలో డాడీ' అనే పేరును ఖరారు చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో నాని కుమార్తెగా కియారా ఖన్నా అనే చిన్నారి కనిపించబోతుంది. 


Also Read: Bigg Boss Promo: బిగ్‌బాస్ సీజన్ 7 ప్రోమో వచ్చేసింది.. కంటెస్టెంట్స్‌ ఎవరంటే..?


Also Read: వినాయక చవితికి రానున్న విష్ణు విశాల్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ 'మార్క్ ఆంటోని'



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి