వినాయక చవితికి రానున్న విష్ణు విశాల్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ 'మార్క్ ఆంటోని'

విలక్షణ నటనతో, కథలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు విష్ణు విశాల్.. తాజాగా విశాల్ నటిస్తున్న 'మార్క్ ఆంటోనీ' సినిమా షూటంగ్ చివరి దశలో ఉండగా.. వినాయక చవితికి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. 

Last Updated : Jul 11, 2023, 05:00 PM IST
వినాయక చవితికి రానున్న విష్ణు విశాల్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ 'మార్క్ ఆంటోని'

Mark Antony Release Date: మంచి నటనతో ప్రేక్షకులని ఆకట్టుకున్న హీరో విష్ణువిశాల్ మార్క్ ఆంటోనీ అనే మరో యాక్షన్ ఎంటర్ టైనర్ తో మన ముందుకు రాబోతున్నారు. సైన్స్ ఫిక్షన్, హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో విశాల్ కి జోడీగా రీతూ వర్మ నటిస్తోంది. ఈ సినిమాలో సెల్వ రాఘవన్ ఎస్.జె.సూర్య, సునీల్ వంటి ప్రముఖ నటులు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తుండగా.. ఎస్ వినోద్ కుమార్ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.  చివరి నిర్మాణ పనులు కొనసాగుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 15న వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి సంబంధించిన తాజా అఫిషియల్ రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల  చేసారు మేకర్స్. 

ఈ సినిమాలో నటించే ప్రముఖ నటులు అందరు సరికొత్త రెట్రో లుక్ తో కనిపించటంతో సినిమాపై అంచనాలు రెండింతలు పెరిగాయి. అలాగే ఇటీవల రిలీజైన టీజర్ కు అద్భుతమైన స్పందన లభించింది. గుబురు గడ్డంతో ఫైర్ చేస్తున్న విశాల్ లుక్.. ఎస్.జె.సూర్య కామెడి టైమింగ్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచాయనే చెప్పాలి 

ఈ సినిమాకి మ్యూజిక్ జి.వి. ప్రకాష్ అందిస్తుండగా, యాక్షన్ సన్నివేశాలు పీటర్ హెయిన్స్, దిలీప్ సుబ్బరాయన్, కనల్ కణ్ణన్, దినేష్ సుబ్బరాయన్, సినిమాటోగ్రఫీ అభినందన్ రామానుజం, ఎడిటర్ విజయ్ వేలుకుట్టి బాధ్యతలు తీసుకున్నారు.మార్క్ ఆంటోనీ అనే ఈ సినిమా టైమ్ ట్రావెల్ థీమ్ చుట్టూ తిరిగే కథ. భారీ యాక్షన్ సన్నివేశాలు, సైన్స్ ఫిక్షన్ అంశాలతో, అక్కడక్కడ ఎస్.జె.సూర్య కామెడీ టైమింతో ఈ చిత్రం ఆద్యంతం అందరినీ అలరించనుంది. 

Also Read: Revanth Reddy Comments: ఉచిత విద్యుత్‌పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. రాష్ట్రంలో తీవ్ర దుమారం  

రచయిత, దర్శకుడు: అధిక్ రవిచంద్రన్
నిర్మాత: ఎస్ వినోద్ కుమార్
సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్
ఫైట్స్: పీటర్ హెయిన్స్, దిలీప్ సుబ్బరాయన్, కనల్ కణ్ణన్, దినేష్ సుబ్బరాయన్
డి.ఓ.పి: అభినందన్ రామానుజం
ఎడిటర్: విజయ్ వేలుకుట్టి

Also Read: Ghaziabad Road Accident: కారుపై దూసుకెళ్లిన బస్సు.. ఆరుగురు మృతి.. సీసీ ఫుటేజ్‌లో రికార్డు   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News