నాని నటించిన  V movie  సెప్టెంబర్ 5 న OTT ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఐతే ఓటిటిలో ఈ సినిమా విడుదల కాకముందే ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా స్టొరీ లీక్ ( V Movie story leaked ) అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు, ఫిలింనగర్ టాక్ ప్రకారం.. ఈ సినిమాలో న్యాచురల్ స్టార్ నాని విక్రమాదిత్య ( V-Vikramadithya ) అనే యువకుడి పాత్ర పోషించనున్నాడని.. అతను తన భార్యను హత్య చేసిన వ్యక్తులను చంపి ప్రతీకారం తీర్చుకునే పనిలో ఉంటాడని సోషల్ మీడియాలో వి చిత్ర కథాంశం గురించి పలురకాల కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. అలా తన భార్య హత్యకు కారకులైన వారిని చంపిన ప్రతీ చోట V అనే లెటర్‌ని వదిలేసి వెళ్తాడని.. ఇంతకీ ఈ V అంటే ఎవరు ? ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు అనే కోణంలోనే ఈ సినిమా కథాంశం ఉండనుందనేది సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం సారాంశం. ఈ సినిమాలో వివేక్ కృష్ణ పాత్రలో సుధీర్ బాబు ఈ కేసుని దర్యాప్తు చేసే అధికారి పాత్రను పోషిస్తున్నారని తెలుస్తుంది. Also read : Jr NTR remuneration: ఎన్టీఆర్ పారితోషికం తిరిగిచ్చేశారా ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏది ఏమైనా ఇవన్నీ కేవలం ఊహాగానాలే ( V movie leaked speculations ) కనుక, సెప్టెంబర్ 5 న విడుదలయ్యే V సినిమానే ఈ సందేహాలన్నింటికీ సమాధానం చెబుతుంది. అన్నింటికిమించి న్యాచుర్ స్టార్ నాని, డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటిల కాంబినేషన్‌పై ఆడియెన్స్‌లో ప్రత్యేకమైన అంచనాలు ఉన్నాయి. అలా అన్ని అంచనాల మధ్య విడుదలయ్యే ఈ చిత్రంపై లీకుల ప్రభావం అంతగా పడకపోవచ్చనే చెప్పుకోవాలి. Also read : V movie: వి మూవీ OTT రైట్స్ ఎంతో తెలుసా ?


వాస్తవానికి మార్చి 25నే తెలుగు నూతన సంవత్సర కానుకగా ఈ మూవీ విడుదల కావాల్సి ఉండే కానీ Coronavirus మహమ్మారి కారణంగా అప్పట్లో వాయిదా పడింది. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నివేదా థామస్, అదితి రావు హైదరి, వెన్నెల కిషోర్, జగపతి బాబు, నాజర్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. Also read : Interesting facts: వినాయక చవితి కథలో ఎన్నో ఆసక్తికరమైన అంశాలు


Also read : Surekha Vani: కనిపించిన ప్రతీ మగాడితో అఫైర్స్ అంటగడుతున్నారని నటి ఆవేదన