Vinayaka chavithi story: వినాయక చవితి అనగానే ముందుగా గణపతికి ఇష్టమైన ఉండ్రాళ్లు, పాయాసం, పళ్ళు, పిండి వంటలు ప్రత్యేకం. ఇవన్ని వినాయక చవితి రోజు గణనాథునికి సమర్పించుకొని విజ్ఞాలు తొలగిపోవాలని వేడుకుంటాము. గణేష్ చతుర్థి పండుగను బాద్రప్రద శుద్ద చతుర్తి ( చవితి ) రోజు జరుపుకుంటాం. అలాగే వినాయకుని కథలో ( Vinayaka chavithi katha ) గౌరి తనయునికి ఏనుగు తల ఎలా వచ్చిందో, చంద్రుని చూస్తే ఆ రోజు ఏమవుతుందో అనే విషయం మాత్రమే చాలా మందికి తెలిసిన కథ. కాని ఏనుగు తలనే వినాయకుడికి పెట్టడానికి గల కారణం, చంద్రుని చూసిన వారికి పార్వతి దేవి పెట్టిన శాపం, ఆ శాపం కారణంగా శ్రీ కృష్ణుడు 'శమంతకమణి'ని దొంగిలించాడని వచ్చిన నీలాపనిందలు, తరువాత శ్రీ కృష్ణుడు జాంబవతిని, సత్యభామను పెళ్లాడడం ఇదంతా వినాయక కథలోని భాగమే అనే విషయాలన్ని చాలా మందికి తెలియదు ( Ganesh chaturthi story ). Also read : Ganesha idols makers: గణపతినే నమ్ముకున్నాం.. ఇలా అవుతుందనుకోలేదు
ఐతే, టాలీవుడ్ డైలాగ్ కింగ్ మోహన్ బాబు ( Mohan Babu ) 'వినాయక చవితి' పండుగ సందర్భంగా ఈ పండుగ ప్రాముఖ్యతను వివరిస్తూ తెలుగులో 'వినాయక చవితి' కథను మంచు విష్ణు ( Manchi Vishnu ) కోరిక మేరకు ఎంతో ఓపిగ్గా, చక్కగా మనకు వివరించారు. ఈ వీడియోను విష్ణు మంచు తన ఇన్స్టాగ్రామ్లో అలాగే మంచు లక్ష్మి ( Manchu Laxmi ) కూడా తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి అభిమానులందరికీ 'వినాయక చవితి' పండుగ ప్రాముఖ్యతను తెలిపారు. Also read : జైజై గణేశా: వినాయకుడి పూజలో Celebrities
హిందూ ఆచారం ప్రకారం, పూజ పూర్తయిన తర్వాత వినయక చవితి కథ విని నైవేధ్యాలను సమర్పించుకుంటే విజ్ఞాలు తొలగి తమ కుటుంబమంతా సుఖ సంతోషాలతో ఉంటారని ప్రతీతి. Also read : Ganesh Photos: కరోనాను ఖతం చేసే కరోనా వినాయకుడు
అలాగే ఇప్పుడు మీరు కూడా ఈ కథను వినండి.
'జై బోలో గణేష్ మహారాజ్కి జై'…