Tuck Jagadish shooting halted: నాచురల్ స్టార్ నాని 'టక్ జగదీష్' చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కరోనా లాక్ డౌన్ తరువాత ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. నానీ అక్టోబర్ 7 నుండి 'టక్ జగదీష్' షూటింగ్‌కి హాజరయ్యాడు. సుమారు 10 రోజుల షూటింగ్ తరువాత, ఈ సినిమా షూటింగ్ మళ్ళీ నిలిచిపోయింది. టక్ జగదీష్ బృందంలోని సాంకేతిక సిబ్బందిలో ఒకరికి కరోనావైరస్ పాజిటివ్ ( Tuck Jagadish crew tested positive for COVID-19) అని తేలడంతో ఈ సినిమా షూటింగ్ ఆపేశారు. ముందు జాగ్రత్త చర్యగా మొత్తం నటీనటులు, సిబ్బంది హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్ళారు. అతి త్వరలో వారందరికి కూడా కరోనావైరస్ టెస్ట్ చేయనున్నారు. Also read : Prabhas birthday gift: బర్త్ డే గిఫ్టుపై ప్రభాస్ పోస్ట్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టక్ జగదీష్ సినిమాని శివ నిర్వాణ ( Director Shiva Nirvana ) డైరెక్ట్ చేస్తున్నాడు. రితు వర్మ, ఐశ్వర్య రాజేష్ ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్‌ని నిర్మిస్తున్నారు.


లాక్ డౌన్ కారణంగా థియేటర్‌లో విడుదలకు నోచుకోని నాని 'వి' చిత్రం ( V movie ) ఓటిటిలో విడుదలైన సంగతి తెలిసిందే. ఆ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో సుధీర్ బాబు, నివేదా థామస్, అదితి రావు హైదరి నటించారు. 'వి' సినిమాని మోహన్ క్రిష్ణ ఇంద్రగంటి డైరెక్ట్ చేయగా, దిల్ రాజు నిర్మించాడు. Also read : Rajasekhar, Jeevitha: రాజశేఖర్, జీవిత, ఇద్దరు కూతుళ్లకు కరోనా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe