Nara Lokesh meets PAN Indian Star Hero Yash: తెలుగు రాష్ట్ర రాజకీయాలలో నారా లోకేష్ అంటే తెలియని వారే ఉండరు. నందమూరి తారక రామారావు కుమార్తె నారా భువనేశ్వరి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడైన లోకేష్ 2009 నుంచి యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చారు. చదువు పూర్తి చేసిన తర్వాత కొన్నాళ్లపాటు వరల్డ్ బ్యాంకులో ఉద్యోగం చేసిన నారా లోకేష్ తర్వాత తండ్రి రాజకీయ వారసత్వం అందుకుని తెలుగుదేశం పార్టీలో చేరి కొన్ని కీలక పదవులు చేపట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2014 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్- ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన అధికారం కోల్పోయిన తర్వాత ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఇక ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న లోకేష్ త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టబోతున్నారు. ఎలాగైనా 2024లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ముఖ్య ఉద్దేశంగా ఆయన ఈ యాత్రకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.


అయితే అనూహ్యంగా ఇప్పుడు ఆయన కన్నడ స్టార్ హీరో యష్ తో భేటీ అయినట్లు తెలుస్తోంది. దాదాపు 30 నిమిషాల పాటు వీరిద్దరూ కలిసి మాట్లాడుకున్నారని చెబుతున్నారు. ఇక వీరిద్దరి భేటీకి సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. యష్ కూడా గతంలో కన్నడలో సీరియల్ నటుడిగా కెరీర్ ప్రారంభించి తర్వాత కేజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతానికి కూడా చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు సెట్ చేసుకున్న ఆయన ఆ సినిమాల పనిలో ఉండగా వీరిద్దరూ భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది.


ఒక రకంగా చూస్తే నారా లోకేష్ కు కర్ణాటక హీరో అయిన యష్ తో ఎలాంటి సంబంధం లేదు. అలాగే కర్ణాటక హీరో అయిన యష్ కు ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, ప్రస్తుత తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ తోను ఎలాంటి సంబంధం లేదు. అలాంటిది వీరిద్దరూ కలిసి ఎందుకు భేటీ అయ్యారు? అరగంట పాటు ఏం మాట్లాడుకున్నారు? అనే విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ విషయం మీద వారు స్వయంగా ఏదో ఒక క్లారిటీ ఇస్తే తప్ప పూర్తి అవగాహన వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. 


Also Read: Heros Sudarshana Yagam: వరుస ఫ్లాపులతో డుంకీలు కొడుతున్న హీరో.. దేవుడే దిక్కంటున్న తండ్రి! 


Also Read: Nandamuri Balakrishna: బాలకృష్ణపై భూ ఆక్రమణ కేసు పెట్టాలి.. మరీ ఇంత నిర్లక్ష్యమా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook